పురిటిలోనే బిడ్డను కోల్పోయిన తల్లి

కాసిపేట: వైద్యం అందించాల్సిన వైద్యురాలు వదిలేసి వెళ్లిపోయింది. సేవలు చేయాల్సిన సిబ్బంది సెల్‌ఫోన్ ఆటలకు వెరసి ఒక గిరిజన తల్లి పురిటిలోనే బిడ్డను కోల్పోయిన సంఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొంది. ఈ విషయంపై గురువారం కాసిపేట పోలీస్‌ స్టేషన్‌లో వైద్యులపై, సిబ్బంది తీరుపై గిరిజన బాలింత ఏదుల కల్పన ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కాసిపేట మండలం బుగ్గగూడ గ్రామానికి చెందిన ఏదుల ప్రశాంత్ భార్య ఏదుల కల్పన […]


కాసిపేట: వైద్యం అందించాల్సిన వైద్యురాలు వదిలేసి వెళ్లిపోయింది. సేవలు చేయాల్సిన సిబ్బంది సెల్‌ఫోన్ ఆటలకు వెరసి ఒక గిరిజన తల్లి పురిటిలోనే బిడ్డను కోల్పోయిన సంఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొంది. ఈ విషయంపై గురువారం కాసిపేట పోలీస్‌ స్టేషన్‌లో వైద్యులపై, సిబ్బంది తీరుపై గిరిజన బాలింత ఏదుల కల్పన ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కాసిపేట మండలం బుగ్గగూడ గ్రామానికి చెందిన ఏదుల ప్రశాంత్ భార్య ఏదుల కల్పన గర్భిణీ తొలి కాన్పు కావడంతో గత నెల 27న సాయంత్రం 6గంటలకు కాన్పు కొరకు కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లడం జరిగిందన్నారు. ప్రభుత్వ వైద్యురాలు పరీక్షించడం జరిగిందన్నారు. ఎదైన సమస్య వుంటే చెప్పితే మంచిర్యాల పెద్దాసుపత్రికి వెళ్తామని చెప్పినప్పటికి వైద్యురాలు ఎలాంటి సమస్య లేదని ఇక్కడే డెలివరి అవుతావని చెప్పి వైద్యురాలు అడ్మట్ చేసుకొని, ఇంటికి వెళ్లిపోయిందని వారు పేర్కొన్నారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో వెంటనే నా భర్త ప్రశాంత్, బంధువులు వైద్యురాలుకు సమాచారం అందించినప్పటికి స్పందించలేదని, చాల సేపటికి సిబ్బంది. వచ్చి చూసి చికిత్స చేయకుండా మా నిద్ర చెడగొట్టావు అంటు దుర్బషలాడుతూ, సెల్‌లో ఏదో ఆటలు ఆడుకుంటు వుందని బాధితురాలు పేర్కోంది. నొప్పులు భారించలేక ఏడుస్తుంటే సిబ్బంది అసభ్యంగా తిట్టారని ఆమె వాపోయింది. అప్పుడే నాకు ప్రసవం అయ్యి పాప పుట్టి చనిపోయిందని, తాను ఏడుస్తుంటే చనిపోయింది పాపే కాదా కొడుకు పుట్టి చనిపోయినట్టు ఎందుకు ఏడుస్నున్నావని తిడుతు ఇక్కడి నుండి వెళ్లి పోవాలని గద్దించారని ఆమె పేర్కొంది. వైద్యురాలు వుంటే తన పాప బ్రతేకేదని, నిర్లక్ష్యం వహించిన వైద్యురాలు, సిబ్బందిపై చర్యలు తీసుకొవాలని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొంది.

Comments

comments