పుట్టింది తండా ప్రతిభ కొండంత

నేను పుట్టి పెరిగింది మహబూబాబాద్ జిల్లా సిరోల్ గ్రామం కలెక్టర్ తండా. తల్లిదండ్రులు తేజావత్ మంగమ్మ బెహీలా నాయక్. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న రజాకార్ల రాజ్యం నిజాం నవాబ్ ప్రభుత్వంలో పనిచేసేవారు. మొత్తం తొమ్మిది మంది పిల్లలం. నేను ఐదో సంతానం. నా సహచరి భాగ్యలక్ష్మి. మాకు ఇద్దరు పిల్ల్లలు అందరికి వివాహాలు చేశాం. ప్రస్తుతం ఒకరు సింగపూర్‌లో ఇంజనీరు. ఇంకొకరు బెంగళూరులో ఉన్నారు. కుటుంబం అంతా విద్యతో ఉన్నత ఉద్యోగాలతో పుట్టిన ఊరుకు కుటుంబానికి మంచి పేరు తెస్తున్నారు.
తండాలో మీ బాల్యం, చదువు గురించి…
నా బాల్యం, చదువు అంతా కలెక్టర్ తండాలోనే గడిచింది. నేను చిన్నప్పటి నుండి చదువులో ముందుండేవాడిని. మా గురువులు బానోత్ చంద్రమౌళి, శంకరయ్య, రాజలింగం సార్, తల్లిదండ్రులు గురువులు నాలో ప్రతిభను గుర్తించి నన్ను చాలా ప్రోత్సహించేవారు. వారి ప్రోత్సాహం నాకు చాలా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. మా లెక్కల మాస్టర్ ఎస్.యాదగిరి సార్ నేను పరీక్ష రాసినా రాయకపోయినా నాకు సిలబస్ అంతా గుర్తుంటుందనే ధీమగా చెప్పేవారు. అప్పటికి మా తండాలో చదువుకున్నవారు లేరు. చిన్నప్పటి నుండి నేను తండా నుంచి వచ్చాను అనే భావన ఉండేది కాదు. ఇప్పటి పిల్లల్లాగా చదువే లోకం కాకుండా స్కూల్ అయిపోగానే ఆటల్లో మునిగి తేలేవాడిని. మహబూబాబాద్ టౌన్‌లో ఐదు నుండి ఇంటర్ పూర్తి చేశాను. తరువాత పై చదువుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో పట్టా పొందాను.
తరువాత అహ్మదాబాద్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్ చదివివాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఐఐఎం అహ్మదాబాద్‌కు ఎంపిక చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే.
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పాత్ర పోషిస్తున్న మీరు ఎలా ఫీలవుతున్నారు.
నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే సమాజానికి సేవ చేసే అవకాశం దక్కినందుకు నేను అదృష్టవంతుడిని. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా సేహితులు ఉపాధ్యాయులు ఇంత చదువుకుని స్వార్థంగా ఉండకూడదు సమాజానికి నీ వంతుగా సహాయపడాలని చెప్పేవారు. అలా చెప్పగానే ఇంజనీరింగ్ వదిలి ఐఏఎస్ బాట పట్టాను. ఇప్పుడు చాలా మంది నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. పిల్లలను బాగా చదవాలని ప్రోత్సహిస్తుంటాను. ఇప్పుడు మా తండాలో చదువుకోని ఇళ్లు లేదు. మా తండాతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో కూడా పాఠశాలలకు బల్లలు, అమ్మాయిలకు సైకిల్స్ ఇప్పించాను. పుస్తకాలు కూడా ఇప్పిస్తుంటాను. తెలంగాణ ప్రజలకే కాదు ఒరిస్సా ప్రజలకు కూడా స్వచ్ఛందంగా సహాయం చేస్తుంటాను.
మాతృభాష మీద మీ మమకారం…
మాతృ భాష అంటే అమ్మ చేతి గోరు ముద్ద లాంటిది. అ మధురమైన ప్రేమ వర్ణానాతీతం. అలాంటిదే మాతృ భాషకూడా. సమాజానికి సరైన విద్య అందించడం ద్వారా మాత్రమే ఈ దేశంలో సామాజిక ,ఆర్ధిక మార్పులను తీసుకురాగలం. పాఠశాల స్థాయిలో పిల్లలకు మాతృభాష, లేదా ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాట్లాడుకునే భాషలో విద్యాభ్యాసం చేయాలి. దాంతో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రంతో పాటు భారతీయ
సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర మొదలైన వాటికి బలమైన పునాది వేసినవాళ్లం అవుతాం. అలా చేసినప్పుడే పిల్లలకు ప్రజల పట్ల దేశం పట్ల
అవగాహన గౌరవం పెరుగుతుంది.
ప్రస్తుత విద్యావిధానం గురించి…
విద్య అంటే పిల్లలకు ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా ఉండాలి. ప్రపంచం పట్ల అవగాహన తెలియజేయాలి. ప్రతిరోజూ టీచర్‌ని ప్రశ్న అడిగేలా స్వేచ్చనివ్వాలి. పిల్లల్లో అత్మవిశ్వాసం పెంపొందించాలి. చదువు పట్ల ఇష్టాన్ని పెంచాలి కాని భయాన్ని కాదు. కొన్ని పనులను పిల్లలే స్వయంగా చేసుకోనివ్వాలి. ఎవరో వచ్చి చేస్తారనే భావన మనలో నాటుకుపోతుంది. అది సమాజానికి మంచిది కాదు. సంపాదించి పెడితే తినిపెడతాం అనేది సరైంది కాదు. చిన్నప్పటి నుండి పిల్లలను బాధ్యాతయుతమైన పౌరులుగా తయారు చేయాలి.
రాజకీయ జీవితంతో పాటు, ఏఏ ఆధికారాల్లో, ఎన్ని సంవత్సరాలుగా సేవలందించారు.
విద్యార్థి రోజులలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమానికి మద్దతు పలికాను. 1969 లో తెలంగాణ ఆందోళన కారణంగా ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు. అయితే 2000-, 2014 నుండి ప్రత్యేక రాష్ట్రం సాధించే సమయంలో, క్రియాశీల పాత్ర పోషించాను. చివరికి తెలంగాణ ఉద్యమం చివరి దశలో పాల్గొని, పదవి విరమణ తరువాత ఉద్యమంలో చేరడానికి బంజారా ప్రజలను సమీకరించాడు. ఏపి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదించినప్పుడు, నా అనుభవాన్ని ఉపయోగించుకుంది. 1984 లో ఐపిఎస్ , 1983 ఐఏఎస్ లో చేరడానికి ముందు ఐమిఎమ్, సిఎమ్‌సి, 1978, -83 లో పనిచేశాను. స్టేట్ గవర్నమెంట్ అఫ్ ఇండియాలో, 35 ఏళ్ళు పనిచేశారు.
జిల్లా మేజిస్ట్రేట్‌లో కలెక్టర్ గా. పది జిల్లాలకు డివిజనల్ కమీషనర్‌గా, జనరల్ మేనేజర్ డిఐసి, ఇండస్ట్రీస్ అదనపు డైరెక్టర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ట్రైనింగ్ డైరెక్టర్, టెక్టైల్స్ హ్యాండ్ మగ్గాల డైరెక్టర్, అదనపు సెక్రెటరీ ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఒడిశా ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా, ఒడిషా గవర్నర్ కార్యదర్శిగా, డిఫెన్స్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ జాయింట్ సెక్రటరీగా, మినియేల్స్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ప్రొడక్షన్‌లో అధికారిగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల బోర్డ్ ఒక డిఫెన్స్ పిఎస్యు, ఐఐటి భువనేశ్వర్ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, భువనేశ్వర్ డైరెక్టర్, ఛైర్మన్ సిఎండిగా ఉన్నాను. కటక్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (1999-, 2005, 2011-,2013) అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) సభ్యుడిగా. ఇలా మొత్తం 28 పదవుల్లో సేవలందించాను. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ అధికార ప్రతినిథిగా సేవలందిస్తున్నాడు.
కొన్ని ప్రధానమైన అంశాల గురించి….
ప్రధానంగా ఎలక్ట్రానిక్ డిఫెన్స్ ఉత్పత్తులు, ఉక్కు, ఫెర్రో మిశ్రమాలు, అల్యూమినియం, పవర్, సిమెంట్ మొదలైన వాటిలో ఇండస్ట్రీ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేశాను. రక్షణ ఉత్పత్తిలో ప్రైవేటు రంగాలలో పాల్గొనేవాడిని. పారిశ్రామిక ఉత్పత్తుల లైసెన్స్‌ను జారీ చేయడం ద్వారా రక్షణ ఉత్పత్తిని చేపట్టడానికి SMES వంటి పెద్ద భారతీయ పరిశ్రమలను ప్రోత్సహించడం. UN ఏజెన్సీలు, ప్రపంచ బ్యాంకు, IDBI, SIDBI నాబార్డ్, CII, FICCI , ASSOCHAM వంటి ఇండస్ట్రీస్ ఫెడరేషన్ల వంటి అభివృద్ధి బ్యాంకులతో సమన్వయంతో పనిచేసే సమయంలో రక్షణ భద్రతా విషయాలలో అనేక అంతర్జాతీయ ప్రతినిధులకు నాయకత్వం వహించి, 50 మంది ఉన్నత స్థాయి రక్షణ ప్రతినిధులతో బాధ్యతలు వ్యవహరించాను. అండర్సాండింగ్ అండ్ ప్రోటోకాల్ డజను మెమోరాండా ఖరారు చేశాను. డైరెక్టర్ల ఇన్సిట్యూట్ (IOd) క్రియాశీలక సభ్యున్ని, సామాజిక బాధ్యతలను ప్రోత్సహించడంలో అది ఒక సంస్థ. IOD హైదరాబాద్ చాప్టర్ గౌరవ ఛైర్మన్‌గా ఉన్నాను. 1982 లో నేషనల్ మేనేజ్‌మెంట్ అవార్డును జాతీయ స్థాయిలో గెలిచాను.