పుచ్చకాయలతో డేంజరస్ స్టంట్..! (వీడియో)

అహ్మదాబాద్:  పుచ్చకాయతో డేంజరస్ స్టంట్ చేసి ఇద్దరు యువకులు గిన్నీస్ రికార్డు నమోదు చేశారు. గుజరాత్ లోని సూరత్ లో ఈ అత్యంత ప్రమాదకరమైన సాహస ఘట్టం అవిష్కృతమైంది. సూరత్ కు చెందిన విస్పి ఖరాడీ, విస్పి కసాడ్ లు ఈ సాహసానికి పునుకున్నారు. పొట్టపై పుచ్చకాయలను పెట్టుకుని కత్తితో కట్ చేస్తూ ఈ ఫీట్ చేశారు. ఏ మాత్రం తేడా వచ్చిన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న ఈ డేంజరస్ స్టంట్ లో కేవలం నిమిషం వ్యవధిలో […]

అహ్మదాబాద్:  పుచ్చకాయతో డేంజరస్ స్టంట్ చేసి ఇద్దరు యువకులు గిన్నీస్ రికార్డు నమోదు చేశారు. గుజరాత్ లోని సూరత్ లో ఈ అత్యంత ప్రమాదకరమైన సాహస ఘట్టం అవిష్కృతమైంది. సూరత్ కు చెందిన విస్పి ఖరాడీ, విస్పి కసాడ్ లు ఈ సాహసానికి పునుకున్నారు. పొట్టపై పుచ్చకాయలను పెట్టుకుని కత్తితో కట్ చేస్తూ ఈ ఫీట్ చేశారు. ఏ మాత్రం తేడా వచ్చిన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న ఈ డేంజరస్ స్టంట్ లో కేవలం నిమిషం వ్యవధిలో ఉదరంపై 49 పుచ్చకాయలను కట్ చేశారు. గతంలో ఉన్న 48 పుచ్చకాయల రికార్డును బద్దలు కొట్టారు. ఇంతకుముందు కూడా విస్పి ఖరాడీ, విస్పి కసాడ్ లు పలు సాహసకృత్యాలు చేశారు.