పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం…

నాగర్‌కర్నూల్: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తల్లీ, ఒక కూతురు మృతిచెందారు. మరో కూతురి పరిస్థిితి విషమంగా ఉండడంతో సమీప సర్కార్ దవాఖానకు తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. తల్లి తన పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ […]

నాగర్‌కర్నూల్: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తల్లీ, ఒక కూతురు మృతిచెందారు. మరో కూతురి పరిస్థిితి విషమంగా ఉండడంతో సమీప సర్కార్ దవాఖానకు తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. తల్లి తన పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Stories: