పిట్టగూడలో గర్భీణి మృతి

Pregnency Lady Dies In Mancherial District

లింగాపూర్: మండలంలోని పిట్టాగూడ గ్రామానికి చెందిన మాడావి ఇందుబాయి (27) ఏడు నెలల గర్భీణి రక్తహీనతో మృతి చెందిన్నట్లు ఇందుబాయి భర్త సీతారామ్ తెలిపారు. ఇందుబాయికి ఆరోగ్యం బాగ లేక లింగాపూర్‌లోని పిహెచ్‌సి తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్ళాలని తెలిపారు. దీంతో ఇందుబాయి ని రిమ్స్ ఆస్పత్రి చేర్పించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఆమె భర్త  తెలిపారు.