పిఎం మోడీతో ముగిసిన సిఎం కెసిఆర్ భేటీ

CM KCR Meeting with PM Modi in Delhi

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ సిఎం కెసిఆర్ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు 20 నిమిషాల పాటు కొనసాగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో వారు చర్చించినట్టు తెలిసింది. విభజన హామీలతో పాటు రక్షణ శాఖ భూములు రాష్ట్ర సర్కారుకు అప్పగించే విషయంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజనపై కెసిఆర్ మోడీతో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ భేటీలో ముందస్తు ఎన్నికలు, ఇతర రాజకీయా అంశాల ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం.

CM KCR Meeting with PM Modi in Delhi

Comments

comments