పాలమూర్, రంగారెడ్డి ప్రాజెక్టుతో సస్యశ్యామలం

లక్ష ఎకరాలకు సాగునీరందిస్తాం ప్రతిపక్షాల నుండి టిఆర్‌ఎస్‌లోకి వలసలు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/పెబ్బేరు : ప్రపంచంలోనే పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టు గర్వించదగినదని ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 4 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పెబ్బేరు మండల కేంద్రంలో ఆంజనేయస్వామి, ఎస్సీ కాలనీలో జరిగిన పార్టీలో చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూర్, రంగారెడ్డి […]

లక్ష ఎకరాలకు సాగునీరందిస్తాం
ప్రతిపక్షాల నుండి టిఆర్‌ఎస్‌లోకి వలసలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/పెబ్బేరు : ప్రపంచంలోనే పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టు గర్వించదగినదని ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 4 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పెబ్బేరు మండల కేంద్రంలో ఆంజనేయస్వామి, ఎస్సీ కాలనీలో జరిగిన పార్టీలో చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూర్, రంగారెడ్డి ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని, విద్యుత్ ఉత్పత్తి 139 మెగావాట్ల విద్యుత్, 12 లక్షల ఎకరాలకు సాగునీరందించే బృహత్తర ప్రాజెక్టు పాలమూర్‌రంగారెడ్డి అన్నారు. గత పాలకులు జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి 30 ఏళ్లు సమయం పట్టిందన్నారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం, పాలమూర్, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను శరవేగంగా నిర్మించడం జరుగుతుందన్నారు. రైతుబంధు పథకం, రైతులందరికి భరోసా నిచ్చిందన్నారు. రైతుబీమాను ఆగష్టు 15న ప్రారంభించనున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే విద్యుత్‌తో తీవ్ర కష్టాలు వస్తాయని ఎద్దేవా చేశారన్నారు. నేడు తెలంగాణలో వ్యవసాయం, కంపెనీలు, కుటీర పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. యావత్ భారత దేశం గర్వించే విధంగా తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని అది ప్రజలు గమనిస్తున్నారని నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరందించడమే తన ఏకైక లక్షమన్నారు. నియోజక వర్గంలో నామినేషన్ వేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. పెబ్బేరు మండలంలో టిడిపి, సిపిఐ పార్టీల నుండి భారీగా టిఆర్‌ఎస్‌లోకి నిరంజన్‌రెడ్డి సమక్షంలో కార్యకర్తలు చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి కూడా భారీగా టిఆర్‌ఎస్‌లోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ప్రజల సమి ష్టి కృషితో అభివృద్ధి సాధ్యమన్నారు. టిఆర్‌ఎస్ మండలా ధ్యక్షులు హరిశంకర్‌నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మార్కెట్‌యార్డుచైర్మన్ గౌని బుచ్చారెడ్డి, ఎంపిపిలు పద్మావతి రమణ, శంకర్‌నాయక్, టిఆర్‌ఎస్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యారెడ్డి, అక్కమ్మ, కోఆప్షన్ సభ్యులు ఎండి. ముస్తాక్, ఎంపిటిసిలు ఐజాక్, శివశంకర్‌గౌడ్, కుమ్మరి అచ్చన్న, రాజు, కృపాకర్‌రెడ్డి, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: