పాలమూరు ప్రజలకు నీరందించాలన్నదే కెసిఆర్ కల

జోగులాంబ గద్వాల : పాలమూరు ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలన్నదే తెలంగాణ సిఎం కెసిఆర్ కల అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆర్‌డిఎస్ కోసం కెసిఆర్ పోరాటం చేశారని ఆయన తెలిపారు. శుక్రవారం జరిగిన నడిగడ్డ ప్రగతి సభలో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణోద్యమ కాలం నుంచి నేటి వరకు సిఎం కెసిఆర్ పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు కృషి చేశారని ఆయన కొనియాడారు. ప్రజల బాగు కోసం కెసిఆర్ యాత్రలు చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం పదవుల […]

జోగులాంబ గద్వాల : పాలమూరు ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలన్నదే తెలంగాణ సిఎం కెసిఆర్ కల అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆర్‌డిఎస్ కోసం కెసిఆర్ పోరాటం చేశారని ఆయన తెలిపారు. శుక్రవారం జరిగిన నడిగడ్డ ప్రగతి సభలో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణోద్యమ కాలం నుంచి నేటి వరకు సిఎం కెసిఆర్ పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు కృషి చేశారని ఆయన కొనియాడారు. ప్రజల బాగు కోసం కెసిఆర్ యాత్రలు చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం పదవుల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రూ.554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారని, ఈ పథకం ద్వారా 33వేలకు నీరందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ఆయన ప్రజలను కోరారు.

Minister Harish Rao Comments on Congress

Comments

comments

Related Stories: