పాలమూరు కాంగ్రెస్ లో టెన్షన్

టిఆర్‌ఎస్ దూకుడు,  హస్తం నియోజకవర్గాలే టార్గెట్, అసంతృప్తులపై నజర్ మన తెలంగాణ /మహబూబ్‌నగర్ ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొంత కాలమే సమయం ఉండడంతో ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు వేయని ఎత్తుగడులు లేవు. అయితే ఆ పార్టీ ఎత్తులను చిత్తు చేస్తూ టిఆర్‌ఎస్ దూకుడు పెంచింది. ముఖ్యంగా కాంగ్రెస్ నియోజకవర్గాలనే టిఆర్‌ఎస్ టార్గెట్ చేస్తూ రాజకీయ వేడిని పెంచింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాల్లో […]

టిఆర్‌ఎస్ దూకుడు,  హస్తం నియోజకవర్గాలే టార్గెట్, అసంతృప్తులపై నజర్

మన తెలంగాణ /మహబూబ్‌నగర్ ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొంత కాలమే సమయం ఉండడంతో ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు వేయని ఎత్తుగడులు లేవు. అయితే ఆ పార్టీ ఎత్తులను చిత్తు చేస్తూ టిఆర్‌ఎస్ దూకుడు పెంచింది. ముఖ్యంగా కాంగ్రెస్ నియోజకవర్గాలనే టిఆర్‌ఎస్ టార్గెట్ చేస్తూ రాజకీయ వేడిని పెంచింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో గులాబి జెండాలు ఎగురు వేయాలన్న లక్షంతో టిఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్ఠాత్మకమైన తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు గద్వాల నియోజకవర్గం అభివృద్ధికి గతంలో ఎవరూ చేయని విధంగా రూ. 100 కోట్లు నిధులు మంజూరు చేశారు.

అంతేకాదు గద్వాలకు 300 పడకల గదులు ఆసుపత్రి, బస్టాండ్ ఆధునీకరణకు రూ. 2 కోట్లు, జూరాల దగ్గర అందమైన పార్కుకు రూ. 15 కోట్లు మంజూరు చేశారు. గట్టులో ఒక గురుకుల, ఎస్టీ గురుకుల రెసిడెన్సియల్ పాఠశాలలు మంజూరు చేశారు. ఇప్పటికే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటి దశ పూర్తి చేయడంతో పాటు ఎత్తు పెంచాలని సిఎం సూచనలు చేశారు. మొదటి దశ పనులు పూర్తి అయితే ఆర్‌డిఎస్ చివరి ఆయికట్టుకు నీరివ్వాలని సిఎం ఆలోచన. ఇదే జరిగితే ఇక్కడ అభివృద్ది మంత్రంతో కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టాలన్నది టిఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. గద్వాల బహిరంగ సభలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేరును సిఎం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టాలని టిఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఒక వైపు గద్వాలలో టిఆర్‌ఎస్ నేతలను సమన్వయం చేస్తూనే అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నుంచి వలసలు వచ్చే నాయకులు, కార్యకర్తలను టిఆర్‌ఎస్ ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి కంచుకోటగా ఉన్న కోస్గికి ఈ నెల 13న మంత్రి హరీశ్‌రావు వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు హరీష్‌రావు పర్యటన ఉండబోతోందని జిల్లాలో చర్చ జరుగుతున్నది. ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

రేవంత్, నాగం, అరుణలే టార్గెట్  కాంగ్రెస్‌లో వాదనలను ఎక్కువగా వినిపించే కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి,డికె అరుణలనే టార్గెట్ చేస్తూ టిఆర్‌ఎస్ నేతలు రాజకీయ విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో పాలమూరుకు చేసిన అభివృద్దిని, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్దిపై టిఆర్‌ఎస్ బహిరంగ చర్చకు సిద్దమంటూ ప్రకటిస్తుండడంతో కాంగ్రెస్ ఉలిక్కిపడుతోంది. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న కోర్టుల్లో కేసుల విషయంపై టిఆర్‌ఎస్ చేస్తున్న వాదనలు ప్రజల్లో మరింత చొచ్చుకుపోతున్నాయి. జిల్లాలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, చెరువులకు నీరు, కోయలసాగర్, నెట్టెంపాడు, జూరాల వంటి అనేక పనులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా కాంగ్రెస్ చేపడుతున్న ప్రచారంపై టిఆర్‌ఎస్ తమ అభివృద్ధి ప్రచారంతో తిప్పికొడుతోంది. గత కొంత కాలంగా టిఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు,సిఎం కెసిఆర్,ఐటి మంత్రి కెటిఆర్‌లు, కాంగ్రెస్ నేతలు డికె అరుణ, నాగంలను టార్గెట్ చేస్తూ చేస్తున్న ప్రసంగాలు కాంగ్రెస్ నేతల్లో బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. టిఆర్‌ఎస్ అడుగుతున్న పశ్నలకు సమాధానాలు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు డిఫెన్స్‌లో పడిపోయారు.

బుజ్జగింపులకు ప్రయత్నాలు

కాంగ్రెస్‌లో వివిధ నియోజకవర్గాలో ఉన్న విభేదాలపై బుజ్జగింపులకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పిసిసి ఆదేశాల మేరకు అంతర్గత కుమ్ములాటలపై దృష్టి సారించారు . ఆదివారం ఎఐసిసి పరిశీలకులు సలీం రావడంతో నియోజకవర్గాల వారీగా బుజ్జగింపులు చేపట్టారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, కొల్లాపూర్, నారాయణపేట, మక్తల్, వనపర్తి, తదితర ప్రాంతాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలపై కార్యకర్తల మనోభావాలను తెలుసుకుంటున్నారు. ఏది ఏమైనా టిఆర్‌ఎస్ రాజకీయ దూకుడుకు కాంగ్రెస్‌లో అంతర్మధనం నెలకొంది.

Related Stories: