పాలమూరుకు వరం..ఐటి హబ్

500 ఎకరాల్లో హబ్ కారిడార్ 100 పరిశ్రమలు రాక ఇప్పటికే 18 పరిశ్రమలకు అనుమతులు మౌళిక సదుపాయల కల్పన పెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వేలాది మందికి ఉపాధి పాలమూరు చుట్టూ పెరగనున్న భూముల ధరలు నేడు మంత్రి కెటిఆర్ రాక ఫలించనున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కృషి మనతెలంగాణ/మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లా అంటే గతంలో వలసలకు, కరువుకు ప్రసిద్ది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విదేశీయులకు పాలమూరు జిల్లానే కరువుకు నిదర్శనంగా చూపించే వారు. కాని […]

500 ఎకరాల్లో హబ్ కారిడార్
100 పరిశ్రమలు రాక
ఇప్పటికే 18 పరిశ్రమలకు అనుమతులు
మౌళిక సదుపాయల కల్పన
పెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు
వేలాది మందికి ఉపాధి
పాలమూరు చుట్టూ పెరగనున్న భూముల ధరలు
నేడు మంత్రి కెటిఆర్ రాక
ఫలించనున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కృషి

మనతెలంగాణ/మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లా అంటే గతంలో వలసలకు, కరువుకు ప్రసిద్ది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విదేశీయులకు పాలమూరు జిల్లానే కరువుకు నిదర్శనంగా చూపించే వారు. కాని తెలంగాణా రాష్ట్ర సిద్ధించిన తర్వాత సిఎం కెసిఆర్ పాలమూరు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పర్యావసనంగా కెసిఆర్ మాన స పుత్రిక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి సాగునీటిని అందిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు యోగ్యంగా 21 లక్షల ఎకరాలు ఉంటే కెసిఆర్ కృషి ఫలితంగా జిల్లాలో నెట్టెంపాడు, జూరాల, బీమా, కోయిలసాగర్ వంటి ప్రాజెక్టుల ద్వార 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు లభించింది. తద్వారా జిల్లాలో గతంలో బుట్టా నెత్తిన బెట్టుకొని మూట ముళ్ల సర్దుకొని ఇతర ప్రాంతాల కు వలసలు వెళ్లిన వారు ప్రస్తుతం కెసిఆర్ కృషి ఫలితంగా తిరిగి తమ గ్రామాలకు చేరుకొని వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కాళ్లపై తాము బతుకుతూ ఆత్మాభిమానంతో గౌరవంగా జీవిస్తున్నారు. సాగునీటి రంగం లో పురోగతి సాధించిన పాలమూరు వరం.. ఐటి హబ్ కెసిఆర్ సర్కార్ ఉద్యోగ ఉపాధి రంగాల్లో పాలమూరు జిల్లా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలన్న మహా సంకల్పంతో పాలమూరు జిల్లాలో ఐటి కారిడార్ హబ్‌కు శ్రీకారం చుట్టుబడుతోంది. ఈ కార్యక్రమంకు నేడు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ హాజరై శంకుస్థాపన చేయనున్నారు. ఐటి హబ్ నిరుద్యోగులకు వరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ఎమ్మెల్యే కృషి ఫలితమే..
స్వయానా పెద్ద పెద్ద చదువులు చదవి ఎంతో కష్టపడి ఉద్యోగం పొంది, సంఘనాయకునిగా ఎందరి బాధను చూసి, ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి ఎందరో బలిదానాలను స్వయంగా చూసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాలమూరు జిల్లా నిరుద్యోగుల కన్నీళ్లను తుడచాలని భావించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి రంగా ల్లో అన్యాయానికి వివక్షతకు గురైన జిల్లా వాసులకు న్యాయం జరగాలన్న లక్షం అయనకు ఐటి హబ్ నిర్మాణ ఆలోచనకు నాంది పలికింది. వెంటనే ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు తన మనసులోని మాటను చెప్పి ఐటి కారిడార్ నిర్మాణానికి చాల కృషి చేశారు. అయన కృషి ఫలితమే ఐటి హబ్‌లో పాలమూరు చరిత్ర ప్రపంచ పటంలో చిరస్థాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

500 ఎకరాల్లో 100 పర్రిశమలు
ఎదిర, దివిటి పల్లె మద్యలో ప్రభుత్వం ఎక్కవగా ఉందన్న ఆలోచనతో ఎమ్మె ల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఆర్‌డిఓ లక్ష్మినారాయణ, తహసీల్దార్ ప్రభాకర్ రావుల ఆధ్వర్యంలో చకాచకా పనులు ప్రారంభమయ్యాయి. ఈ పల్లెల మద్య ఉన్న ప్రభుత్వ భూమికి తోడు కొంత రైతులది కూడా సేకరించారు. మొత్తం 500 ఎకరాల్లో ఐటి కారిడార్ హబ్ నిర్మానం జరగనుంది. ఈ హబ్ నిర్మాణం జరిగితే దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు రానున్నాయి. 100 కంపెనీలు ఈ హబ్‌లో నిర్మాణం జరగనున్నాయి. ఇప్పటికే 18 పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. వారికి ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే మరిన్ని కంపెనీలు రానున్నా యి. ఈ హబ్‌ను హైదరాబాద్‌లో ఉన్న గచ్చిబౌలిలో ఉన్న హబ్ కంటే నూతన సాంకేతిక పరిజ్ణానంతో మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. కనీస మౌళిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రోడ్లు, వీధిలైట్లు, మంచినీరు, కాల్వలు, వంటి సౌకర్యాలకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ హబ్ రాజధానిలోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు 44వ జాతీయ రహదారి ఉండడం తో ఈ హబ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. జాతీయ రహదారికి చేరువలో ఉండడంతో సరుకుల రవాణాకు కూడా సులభంగా జరిగే అవకాశాలు ఉంటున్నాయి.

స్థానిక నిరుద్యోగులకు ఉపాధి :
గతంలో ఎక్కడో ఉపాధి కోసం వెళ్లి నిరుద్యోగులు ఇక మీదట ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకంపడా ఈ ఐటి హబ్‌లోనే ఉద్యోగాలు లభించే అవశాలు ఉన్నాయి. స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఈ హబ్‌లో వేలాది మం దికి ఉపాధి, ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రతిభ కల్గిన యువత ఎంతో మంది ఉన్నారు. సరైన అవకాశాలు లేక తమ నైపుణ్యాలను పక్కన బెట్టారు. ఇంజనీరింగ్, మెకానికల్, ఔషధ పర్రిశమలు, ఇతర పరిశ్రమలు, వంటి ఎన్నో వస్తే ఇక్కడి వారికే మొదటి ప్రాధాన్యత ఉండనుంది.

నేడు కెటిఆర్ రాక.. నిరుద్యోగ యువతతో భేటి
దివిటి పల్లె వద్ద ఐటి కారిడార్ హబ్ పైలాన్ ఆవిష్కరణకు నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ జిల్లాకు రానున్నారు. ముందుగా పైలాన్ ఆవిస్కరణ తర్వాత అక్కడే జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అంతకు ముందు నిరుద్యోగ యవతతో చర్చిస్తారు. అనంతరం మయూరి పార్కులో వాటర్ పాల్స్ ఆవష్కరణతో పాటు మరిన్ని అభివృద్ది పనులు ఆవిష్కరిస్తారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్‌ను సందర్శిస్తారు.

నా కళల స్వప్నం ఐటి హబ్ : ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
ఉద్యమ సమయంలోనూ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వ యంగా చూశాను. ముఖ్యంగా పాలమూరు జిల్లా యువతకు సమైఖ రాష్ట్రం లో తీవ్ర అన్యాయం జరిగింది. సరైన విద్యా, వైద్య,సాగునీటి రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. ఎక్కడా పరిశ్రమలు లేవు, పనులు లేక నిరుద్యోగ యు వత కూడా పనులకు వెళ్లే వారు. వారిని చూసినప్పడుల్లా మనస్సు తరక్కుపోయేది. అందుకే ఎలాగైనా ఐటి హబ్‌ను తీసుకురావాలని లక్షంగా పెట్టుకు న్నా.. అందుకు మంత్రి కెటిఆర్, సిఎం కెసిఆర్‌లు పూర్తిగా నా ఆశను, ఆలోచనను మన్నించి హబ్‌కు శ్రీకారం చుట్టారు. అందుకు సిఎం కెసిఆర్‌కు, మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులకు కృతజ్ఞతలు

Related Stories: