పాలమూరుకు కృష్ణమ్మ పరవళ్లు

జూరాలలో 11గేట్లు ఎత్తివేత 62వేల క్యూసెక్‌ల నీరు శ్రీశైలానికి విడుదల తుంగభద్ర డ్యాంలో 20 గేట్లు ఎత్తివేత నేడు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి సుంకేసులకు నీరు నారాయణపూర్ నుంచి తగ్గని ఇన్‌ఫ్లో జిల్లాలో బీమా, కోయల్‌సాగర్, నెట్టెంపాడుకు నీటి విడుదల జిల్లాలో నిండుకుండల్లా చెరువులు మన తెలంగాణ/మహబూబ్ నగర్ : కరువు నేల తల్లి పలకించేలా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. సుడులు తిరుగతూ నడిగడ్డ ప్రాంతానికి పరుగులు పెడుతోంది. అటు తుంగభద్ర నది, ఇటు […]

జూరాలలో 11గేట్లు ఎత్తివేత
62వేల క్యూసెక్‌ల నీరు శ్రీశైలానికి విడుదల
తుంగభద్ర డ్యాంలో 20 గేట్లు ఎత్తివేత
నేడు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి సుంకేసులకు నీరు
నారాయణపూర్ నుంచి తగ్గని ఇన్‌ఫ్లో
జిల్లాలో బీమా, కోయల్‌సాగర్, నెట్టెంపాడుకు నీటి విడుదల
జిల్లాలో నిండుకుండల్లా చెరువులు

మన తెలంగాణ/మహబూబ్ నగర్ : కరువు నేల తల్లి పలకించేలా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. సుడులు తిరుగతూ నడిగడ్డ ప్రాంతానికి పరుగులు పెడుతోంది. అటు తుంగభద్ర నది, ఇటు కృష్ణానది జిల్లాలో పొంగిపొర్లుతున్నాయి. ఇటు మహారాష్ట్ర, అటు కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి జలశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.కర్నాటకలో తుంగభద్ర డ్యాంకు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో అక్కడ గేట్లు అధికారులు ఎత్తివేశారు. ఇటు మహారాష్ట్రలో ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంలు పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు దిగువకు నీటిని విడుదల చేయడంతో దిగువన ఉన్న జూరాల నిండు గర్భిణీని తలపిస్తోంది. జూరాలకు భారీగా వర ద నీరు వచ్చే అవకాశాలు ఉండడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు జూరాల కుడి, ఎడమ కాలవలకు నీటిని విడుదల చేసి ప్రధాన చెరువులకు నీటితో నింపే కార్యక్రమం జరుగుతోంది. అటు బీమా, నెట్టెం పాడు, కోయలసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాలమూరు జిల్లా వరద నీటితో కళకళ లాడుతోంది. జూరాలకు పూర్తి స్థాయి నీటి మట్టం చేరడంతో జలకళ ఉట్టి పడుతోంది. నిన్న రాత్రి 8:30గంటలకి అధికారులు జూరాలలో 11గేట్లను ఎత్తివేశారు. 62వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేశారు. జిల్లాలోని జలశాలలకు నీరు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జూరాల కింద ఉన్న ఆయికట్టు దారులు ఇప్పిటికే నారుమళ్లు వేసుకొని ఉన్నారు. ప్రాజెక్టుకు నీరు రావడం, అటు కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయడంతో నాట్లువేసుకునే అవకాశాలు ఉన్నాయి. చెరువులకు నీరు చేరుతుండంతో పల్లె సీమలు సశ్యశ్యామలం కానున్నాయి. పచ్చని వరి పంటలతో కళకళలాడే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నారాయణపూర్ నుంచి జూరాలకు రోజుకు 65 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పవర్‌హౌస్‌కు 24 వేలు క్యూసెక్కులు విడుదల చేశారు. నెట్టెం పాడు 1500 క్యూసెక్కులు, బీమాకు 1300 క్యూసెక్కులు, కోయల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు నీరు, ఎడమ కాల్వకు 800, కుడి కాల్వకు 315 క్కూసెక్కులు, మొత్తం జూరాల నుంచి 29.495 క్యూసెక్కుల నీటిని బయటికి తరలిస్తున్నారు. అంతేకాకుండా ప్రధాన చెరువులను నీటితో నింపుతున్నారు. ఇప్పటికే బంగా ళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడంంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో జలాశయాలకు నీరు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వరదనీరు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బళ్లారిజిల్లా హొస్పేట్ దగ్గర ఉన్న తుండభద్ర నది నుంచి అక్కడి అధికారులు డ్యాం గేట్లు ఎతివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. నేటి సాయంత్రంకు సుంకేసుల ప్రాజెక్టును నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుంగభద్ర నీటి మట్టం 100 .18 టిఎంసిలు కాగా, ఇప్పటి వరకు 93.574 టిఎంసిలు నిల్వ ఉన్నాయి. డ్యాంకు ఇన్‌ఫ్లో 72319 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ ఫ్లో 66500 క్యూసెక్కుల నీరు దిగువ నదికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 1633.07 అడుగుల వరకు ఉంది. ఇన్‌ఫ్లో ఉండడంతో రెండు అడుగుల ఎత్తులో 20 గేట్లను గురువారం కిందికి విడుదల చేశారు. ఈ నేఫథ్యంలో తుంగభద్ర నది ఉప్పోంగుతోంది. దీంతో అటు తుంగభద్ర,ఇటు కృష్ణనదుల్లో నీరు పస్కలంగా ఉండం తో శ్రీశైలంకు భారీగా నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కరువు జిల్లా పాలమూరు నేల రెండు నదుల నీటితో కళకళ లాడుతోంది.

Related Stories: