పార్టీ నేతలతో సిఎం అత్యవసర భేటీ

నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలతో ముఖ్యమంత్రి సమావేశం అతి ముఖ్యమైన రాజకీయాంశాలను చర్చించే అవకాశం అంతకు ముందు అమరవీరుల స్థూపానికి సిఎం నివాళులు మన తెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో అత్యసవర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం ఆయన నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. భవన్‌లో అందుబాటులో ఉన్న టిఆర్‌ఎస్  ఎంపిలు, ఎంఎల్‌సి లు, ఎంఎల్‌ఎలతో ఆయన భేటీ […]

నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలతో ముఖ్యమంత్రి సమావేశం
అతి ముఖ్యమైన రాజకీయాంశాలను చర్చించే అవకాశం
అంతకు ముందు అమరవీరుల స్థూపానికి సిఎం నివాళులు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో అత్యసవర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం ఆయన నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. భవన్‌లో అందుబాటులో ఉన్న టిఆర్‌ఎస్  ఎంపిలు, ఎంఎల్‌సి లు, ఎంఎల్‌ఎలతో ఆయన భేటీ అవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయపరమైన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించడంతో పాటు పార్టీ నేతలకు ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సందడితో పాటు వివిధ అంశాలపై కెసిఆర్ కూలంకషంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 7వ తేదిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తలపెట్టిన ఆశీర్వాద సభతో పాటు భవిష్యత్ రాజకీయ కార్యాచరణను నిర్దేశించే అవకాశం ఉంది. ఇదే నెలలో వివిధ నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్ధుల పేర్లను ప్రకటించనున్నట్ల కెసిఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది. బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను కూడా ఈ సమావేశంలో వారికి కెసిఆర్ వివరిస్తారని తెలుస్తోంది. ఎన్నికల ఎప్పుడు వచ్చినా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో సన్నిద్దంగా ఉండాలని కెసిఆర్ వారికి హితబోధ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో కెసిఆర్ ఎలాంటి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకుంటారన్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

comments