పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు : హరీశ్‌రావు

సిద్దిపేట : టిఆర్‌ఎస్‌లో అంకితభావంతో పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఇస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దానబోయిన లక్ష్మి ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హరీశ్‌రావు శుక్రవారం లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన […]

సిద్దిపేట : టిఆర్‌ఎస్‌లో అంకితభావంతో పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఇస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దానబోయిన లక్ష్మి ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హరీశ్‌రావు శుక్రవారం లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గంలో 18 కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద ఆర్థిక సాయం అందించామని ఆయన తెలిపారు. కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Harish Rao Give the insurance cheque Road Accident Victim Family

Comments

comments

Related Stories: