పారిశుద్ధం పట్ల శ్రద్ధ చూపాలి: కలెక్టర్

మనతెలంగాణ/సిరిసిల్ల: జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్య ంలో అధికారులు ప్రజల ఆరోగ్యం,పారిశుద్ధం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. బుధవారం అధికారులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో వర్షాలు కురియడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ముఖ్యంగా గర్భిణీలు,బాలింతలు,శిశువులు, వృద్దులు, మహిళల వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అ ంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారిని చైతన్యపరచాలన్నారు. గ్రామాల్లో మూకుమ్మడిగా జ్వరాల బారిన […]

మనతెలంగాణ/సిరిసిల్ల: జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్య ంలో అధికారులు ప్రజల ఆరోగ్యం,పారిశుద్ధం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. బుధవారం అధికారులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో వర్షాలు కురియడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ముఖ్యంగా గర్భిణీలు,బాలింతలు,శిశువులు, వృద్దులు, మహిళల వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అ ంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారిని చైతన్యపరచాలన్నారు. గ్రామాల్లో మూకుమ్మడిగా జ్వరాల బారిన ప్రజలు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ప్ర జలు జ్వరాల బారిన పడిన సమాచారం అందగానే సత్వరమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ని ర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌వో మారుతీరావు, డిడబ్లూవో సరస్వతి, డిఆర్‌డివో రవీందర్, డిపిఒ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: