పాము కాటుతో రైతు మృతి…

Farmer Died With Snake Bite
పుల్‌కల్: అర్ధరాత్రిలో పోలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళి పాము కాటుకు గురై రైతు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్‌రావ్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని మిన్పూర్ తాండకు చెందిన రమావత్ హరిచందర్(65) ఆదివారం రాత్రి వ్యవసాయ పనుల కోసం తన పోలానికి వెళ్ళి పాము కాటుకు గురైయ్యాడు. సోమవారం హరిచందర్ సృహ తప్పి పడిపోయాడు. దీంతో పాము కాటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతూ సోమవారం మృతి చెందాడు. శవాన్ని పంచనామ నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌రావ్ తెలిపారు.

Comments

comments