పాము కాటుతో బాలిక మృతి

Five Year old Girl died with Snake Bite in Nirmal Districtనిర్మల్‌: బహిర్భూమికి వెళ్లిన ఐదేళ్ల బాలిక పాము కాటుతో మృతి చెందిన విషాద సంఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న చెంచు సామాజిక వర్గానికి చెందిన నక్క ఎర్రన్న, నర్సవ్వ దంపతుల కూతురు నక్క శిరీష (5) అనే బాలిక పాము కాటుకు గురై మృతి చెందింది.  చిన్నారికి పాము కాటు వేయగానే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా పాము మంత్రం అంటూ నిర్లక్ష్యం చేశడంతో బాలిక పరిస్థితి విషమించింది. చివరికి ఖానాపూర్‌ ప్రభు త్వాసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడికి చేరుకోగానే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.