పాముకాటుతో రైతు మృతి

Farmer-died

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కేంద్రంలో పాముకాటుతో రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. రామలచ్చయ్య అనే రైతు బావి దగ్గర గుడిసెలో నిద్రిస్తుండగా పాముకాటు వేయడంతో ఘటనా స్థలంలో సదరు రైతు మృతి చెందాడు. బావుల దగ్గర ఉన్న రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Comments

comments