పాన్‌తో పండుగలు

శ్రావణమాసం వచ్చేసింది. పెళ్లిళ్లూ, పేరంటాలు, పండగలు, పార్టీలు ఒకటేమిటి సంబరాలు, సందడులు కూడా మొదలయిపోయాయి… వచ్చిన అతిథులకు మర్యాదలు… వారికి  రాగానే ఫలహారాలు, తేనీటి విందులు… పలు రకరకాల పిండివంటలతో  భోజనాలు పెట్టి మర్యాదలు చేస్తాం.  భోజన కార్యక్రమం తరువాత తాంబూలం ఇవ్వడం మనకు అనాదిగా వస్తున్న ఒక ఆచారం.  కిళ్లీ లేదా తాంబూలం వేసుకోవడం  ఆచార వ్యవహారం మాత్రమే కాదు,  తిన్న దాన్ని అరిగించే చక్కని ఔషధం కూడా.   కిళ్లీలో వాడే తమలపాకు గుండెకి మంచి […]

శ్రావణమాసం వచ్చేసింది. పెళ్లిళ్లూ, పేరంటాలు, పండగలు, పార్టీలు ఒకటేమిటి సంబరాలు, సందడులు కూడా మొదలయిపోయాయి… వచ్చిన అతిథులకు మర్యాదలు… వారికి  రాగానే ఫలహారాలు, తేనీటి విందులు… పలు రకరకాల పిండివంటలతో  భోజనాలు పెట్టి మర్యాదలు చేస్తాం.  భోజన కార్యక్రమం తరువాత తాంబూలం ఇవ్వడం మనకు అనాదిగా వస్తున్న ఒక ఆచారం.  కిళ్లీ లేదా తాంబూలం వేసుకోవడం  ఆచార వ్యవహారం మాత్రమే కాదు,  తిన్న దాన్ని అరిగించే చక్కని ఔషధం కూడా.  

కిళ్లీలో వాడే తమలపాకు గుండెకి మంచి ఆహారం. ఇందులో బిపిని తగ్గించే గుణం ఉంది. కిళ్లీ లేదా తాంబూ లం నమలడం వల్ల లాలాజలం ఎక్కువై జీర్ణశక్తి పెరుగుతుంది.  డిప్రెషన్ తగ్గుతుంది. కానీ తిన్నాక నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇప్పుడు కొత్తగా వివిధ రకాల రుచులతో, ఆకారాలతో కిళ్లీలు వస్తున్నాయి. నవదంపతుల కోసం ప్రత్యేకంగా హనీమూన్ పాన్ కట్టే దుకాణాలూ వచ్చాయి. ఆయుర్వేద మందులతో కూడిన స్వర్ణభస్మం, ఖరీదైన సుగంధ ద్రవ్యాలతోపాటు  స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా బంగారు ఫాయిల్  చుట్టిన పాన్‌లు వచ్చాయి. ఇవి చాలా ఖరీదు. మన  భాగ్య నగరం బిర్యానీకే కాదు కిళ్లీ రుచులకూ స్వర్గసీమే. టర్కిష్ కాఫీ, డార్క్ చాకొలెట్, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, రాజ్‌భోగ్, చందన్, గోల్డెన్, సిల్వర్, కేసర్, ఖుష్, కస్తూరి, దిల్‌ఖుష్, హీనా, రోజ్, మామిడి, కోవా, పైన్‌యాపిల్, సురభి, మీనాక్షి, బబుల్‌గమ్, బ్లాక్ ఫారెస్ట్, వాల్‌నట్, స్పెషల్ పంచరంగి, నవరతన్, రజనీగంధ ఇలా రకరకాల కొత్త రుచుల్లో పాన్‌లు వచ్చి అందరికీ చవులూరిస్తున్నాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని పంచేందుకు, వేసవిలో శరీరాన్ని చల్లబరచటానికి,  కాలానుగుణంగా కిళ్లీలు తయారు చేస్తున్నారు. ఐస్‌పొడితో చేసే ఐస్‌పాన్ వేసవిలో తింటే ఆ మజానే వేరంటారు పాన్ ప్రియులు. ఇవి చూస్తే మీరు ఇక పాన్‌ని వేసుకోకుండా ఉండలేరేమో..

కోహినూర్ పాన్

ఇది చాలా ఖరీదైనది. ఈ పాన్ కొంటే జతగా ఇస్తారు. ఖరీదు ఐదువేలు. దీనికి ఇండియన్ వయాగ్రా అని పేరు. ఇందులో కస్తూరి, మస్క్, గులాబీ, కుంకుమపువ్వు వంటి ఖరీదైన దినుసులతోపాటు కొన్ని రహస్య దినుసుల్నీ కలిపి ఔరంగాబాద్‌లోని ఒక పాన్‌వాలా తయారుచేస్తాడట.

ఫైర్ పాన్

సరికొత్త రుచుల్తో వచ్చినదే ఫైర్ పాన్. వాటిని వేసుకోవటంలోనూ పద్ధతులు ఉంటున్నాయి. మొదటగా ఢిల్లీ, ముంబైలో వచ్చింది. ఈ మధ్యనే హైదరాబాద్‌కి పాకింది. దీనికోసం కోల్‌కతా నుండి ఆకుల్నీ, దినుసుల్నీ మసాలానీ దిగుమతి చేసుకుని మరీ తయారు చేస్తున్నారు. ఇందులో సహజమైన మూలికా భస్మాల్ని కలిపి మండించి వినియోగదారుల నోట్లో పెడతామనీ ఇది ఆరోగ్యానికి మంచిదేననీ కిళ్లీవాలాలు చెబుతున్నారు. నోరు కాలకుండా తినమని వైద్యులు సలహా చెబుతున్నారు.

Comments

comments