పాక్ మంత్రివర్గం ఏర్పాటు

ఇస్లామాబాద్ : పాక్ ప్రధానిగా పిటిఐ చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇమ్రాన్‌ఖాన్ 21 మందితో తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 16 మంది మంత్రులు కాగా, మిగిలిన ఐదుగురు పాక్ ప్రధానికి సలహాదారులుగా ఉంటారు. వీరిలో 12 గతంలో పాక్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హయాంలో మంత్రులుగా పని చేశారు. పాక్ విదేశాంగ శాఖ మంత్రిగా షా మహమూద్ ఖురేషీ, రక్షణ మంత్రిగా పెర్వైజ్ ఖట్టక్, […]

ఇస్లామాబాద్ : పాక్ ప్రధానిగా పిటిఐ చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇమ్రాన్‌ఖాన్ 21 మందితో తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 16 మంది మంత్రులు కాగా, మిగిలిన ఐదుగురు పాక్ ప్రధానికి సలహాదారులుగా ఉంటారు. వీరిలో 12 గతంలో పాక్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హయాంలో మంత్రులుగా పని చేశారు. పాక్ విదేశాంగ శాఖ మంత్రిగా షా మహమూద్ ఖురేషీ, రక్షణ మంత్రిగా పెర్వైజ్ ఖట్టక్, ఆర్థిక శాఖ మంత్రిగా అసద్ ఉమర్‌లు వ్యవహరిస్తారు. ఖురేషీ గతంలో పిపిపి ప్రభుత్వంలో 2008-2011 వరకు విదేశాంగ మంత్రిగా పని చేశారు. అసద్ ఉమర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఉమర్ కొడుకు కావడం గమనార్హం. ఖట్టక్ 2013-2018 వరకు ఖయ్యూబర్ -పక్తృత్వ రాష్ట్రానికి సిఎంగా పని చేశారు. ఇమ్రాన్ ఖాన్ మంత్రి వర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది.

Set up the Pak Cabinet on Sunday

Comments

comments