పాకిస్థాన్ సైన్యం దందా.. దాదాగిరి

రామాజీ చీఫ్ పుస్తకంలో విశ్లేషణలు  న్యూఢిల్లీ:  పాకిస్థాన్ ఆర్మీ ఇప్పుడు సైన్యం కాదు ..దందాలకు దిగుతోన్న ఒక అతి పెద్ద కార్పొరేట్ సంస్థ అని భారత పరిశోధనా విశ్లేషణ విభాగం (రా) మాజీ అధినేత విక్రమ్ సూద్ ఆరోపించారు. పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారులు ఇప్పుడు పలు వ్యాపారాలకు దిగుతున్నారని, ఎరువులు మొదలుకుని బ్రెడ్ ఫ్యాక్టరీల వరకూ నడిపిస్తున్నారని, , అయితే తమ అధికారం నిలబెట్టుకోవడడానికి తరచూ కశ్మీర్ అంశాన్ని ఒక బూచీగా చూపెడుతున్నారని విమర్శించారు. రా మాజీ […]

రామాజీ చీఫ్ పుస్తకంలో విశ్లేషణలు 

న్యూఢిల్లీ:  పాకిస్థాన్ ఆర్మీ ఇప్పుడు సైన్యం కాదు ..దందాలకు దిగుతోన్న ఒక అతి పెద్ద కార్పొరేట్ సంస్థ అని భారత పరిశోధనా విశ్లేషణ విభాగం (రా) మాజీ అధినేత విక్రమ్ సూద్ ఆరోపించారు. పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారులు ఇప్పుడు పలు వ్యాపారాలకు దిగుతున్నారని, ఎరువులు మొదలుకుని బ్రెడ్ ఫ్యాక్టరీల వరకూ నడిపిస్తున్నారని, , అయితే తమ అధికారం నిలబెట్టుకోవడడానికి తరచూ కశ్మీర్ అంశాన్ని ఒక బూచీగా చూపెడుతున్నారని విమర్శించారు. రా మాజీ అధినేత అయిన సూద్ రాసిన పుస్తకం ది అన్ ఎండింగ్ గేమ్ …పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా విక్రమ్ సూద్ మాట్లాడారు. తరచూ కశ్మీర్ అంశాన్ని తిరగదోడటం తద్వారా తమ పెత్తనాన్ని సాగించుకోవడం పాకిస్థాన్ సైన్యానికి అలవాటు అయిందని ఈ పుస్తకంలో తెలిపారు.

పాకిస్థాన్ సైన్యం వైఖరి మారే వరకూ ఆ దేశంతో చర్చలతో ప్రయోజనం లేదని తేల్చిచెప్పారు. పాకిస్థాన్ సైన్యం ఇప్పుడు అది పెద్ద కార్పొరేట్ రంగం అని, వారికి భూములు ఉన్నాయి. ఆస్తులు సంపాదించుకున్నారు. అంతేకాదు గోధుమ పిండి గిర్నీలు మొదలుకుని ఫ్యాక్టరీలు బ్రెడ్ తయారీ కంపెనీలు చివరికి హెరాయిన్ అక్రమ రవాణా దందాల వరకూ పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారులు విస్తరించారని , అన్ని విధాలుగా అంశాలను నిరంతరం విశ్లేషించి, నిఘానిర్వహణలో గడించిన అనుభవంతో ఈ వ్యాఖ్యలకు దిగుతున్నట్లు తెలిపారు. ఇంతకాలం అన్ని అంశాలపై తాను రహస్యంగానే పనిచేస్తూ వచ్చానని ఇప్పుడు పాకిస్థాన్ పట్ల తన వైఖరిని బహిరంగంగానే పుస్తక రూపంలో తెలియచేస్తున్నానని పాకిస్థాన్ పేరుకు ఒక దేశం అక్కడున్నది నామమాత్రపు ప్రభుత్వం అని తెలిపారు.

భారత్‌కు చెందిన రాకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకు చాలా తేడా ఉందని, రా దేశ విధాన కర్తలకు సేవలను అందిస్తుందని అయితే ఐఎస్‌ఐ పాకిస్థాన్ విదేశాంగ విధానపు చోదక శక్తిగా ఉంటుందని , ఆ దేశ సైన్యానికి లోగుట్టుగా ఆయువుపట్టుగా వ్యవహరిస్తుందని తెలిపారు. రా ఎల్లవేళలా యుద్ధ నివారణకు యత్నించిందని, మంత్రిత్వశాఖకు, రక్షణ సిబ్బందికితగు సమాచారం అందిస్తుందని దీనితో వారు అన్ని విధాలుగా స్పందించేందుకు వీలేర్పడుతుందని తెలిపారు. పాకిస్థాన్ ఐఎస్‌ఐకు తోడుగా ఉండే జిహాదీలు ఇతర విధ్వంసకర శక్తుల తోడ్పాటు తమకు ఉండదని, ఇటువంటి సంవిధానానికి రా ఎప్పుడూ దూరం అని సూద్ తేల్చిచెప్పారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా జరిగిన చర్చాగోష్టిలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, మాజీ భదరతా సలహాదారు శివశంకర్ మీరనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ వంటి వారు పాల్గొన్నారు. పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 18వ తేదీన పగ్గాలు చేపడుతున్న దశలో భారతీయ అధికారి రాసిన పుస్తకంలో పాకిస్థాన్ సైన్యంపై తీవ్రస్థాయి విశ్లేషణలు ఉండటం కీలకంగా మారింది.

Comments

comments