జకర్తా: ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు సెమీపైనల్లో మలేషియాతో అనూహ్యా ఓటమి పాలైన విషయం తెలిసందే. దీంతో శనివారం జరిగిన కాంస్య పోరులో భారత్ దాయాదీ పాకిస్తాన్ ను మట్టికరిపించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2-1తో గెలిచి కాంస్యం అందుకుంది. భారత్ ఆటగాడు మూడవ నిమిషంలో తొలి గోల్ నమోదు చేశాడు. అనంతరం 50వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ చేయడంతో 2-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ గోల్ అనంతరం రెండు నిమిషాలకే పాక్ ముహ్మద్ అతీఖ్ గోల్ సాధించడంతో స్కోర్ 2-1కు చేరింది. అనంతరం ఇరు జట్లు పోరాడిన గోల్ లభించలేదు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే హాట్ ఫేవరట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు మాత్రం కాంస్యమే లభించింది.
.