పాండ్యాతో పెళ్లిపై ఇషా ఏమన్నారంటే..?

Esha Gupta to Marry Hardik Pandya?

ముంబయి: టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా, బాలీవుడ్ నటి ఇషా గుప్తాతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు హిందీ చిత్రసీమలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ జంటగా పార్టీలు, పబ్బులు, ఈవెంట్లకు హాజరవుతున్నారంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. ఈ క్రమంలో తాజాగా త్వరలోనే పాండ్యా, ఇషా పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ఓ పుకారు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, ఈ వ్యవహారంపై ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ ప్రతినిధి ఇషాను ప్రశ్నించగా… ఆమె కన్ఫ్యూజ్‌తో కూడిన స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా ఇషా మాట్లాడుతూ… ‘నేను తొందర పడదల్చుకోవటం లేదని, పెళ్లికి సమయం వచ్చినప్పుడు చెబుతానని, ఇంతకు మించి ఏం చెప్పలేను’ అంటూ పేర్కొంది. అయితే, పాండ్యాతో సహజీవనం చేస్తున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆమె నవ్వుతోనే సరిపెట్టారట. ఇలా పాండ్యాతో రిలేషన్ షిప్ పై ఇషా అభిమానులను గందరగోళంలో పడేసింది. ఇక గతంలో నటి ఎల్లీ అవ్రమ్‌తో పాండ్యా డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. కొంత కాలానికే వారిద్దరూ విడిపోయారనే వార్తలు వచ్చాయి. ఆ తరువాతనే ఇషాను ఓ పార్టీలో పరిచయం చేసుకుని హార్దిక్‌ సహజీవనం మొదలుపెట్టాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ వారి పనులతో బిజీగా ఉన్నారు. ఈషా బాలీవుడ్‌లో హెరా పెరీ-3, టోటల్‌ ధమాల్‌, పల్టాన్‌ చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉంది. అలాగే పాండ్యా కూడా ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

Comments

comments