పసిపాపల ఆరోగ్యానికి తల్లిపాలే శ్రేష్టం

మన తెలంగాణ/పెబ్బేరు:  పసిపాపల ఆరోగ్యానికి తల్లిపాలే శ్రేష్టమని ఎంఎల్‌ఎ డా. జి.చిన్నారెడ్డి అన్నారు.  అంగన్‌వాడి కేంద్రాలలో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. మండల పరిధిలోని కంచిరావుపల్లిలో అంగన్‌వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలే ముఖ్యమన్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని కోరారు. విద్యతో పాటు పిల్లల ఆరోగ్యాన్ని చూసుకునే బాధ్యత అంగన్‌వాడి టీచర్లుపై ఉందన్నారు. గర్భిణీలకు, బాలింతలకు […]

మన తెలంగాణ/పెబ్బేరు:  పసిపాపల ఆరోగ్యానికి తల్లిపాలే శ్రేష్టమని ఎంఎల్‌ఎ డా. జి.చిన్నారెడ్డి అన్నారు.  అంగన్‌వాడి కేంద్రాలలో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. మండల పరిధిలోని కంచిరావుపల్లిలో అంగన్‌వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలే ముఖ్యమన్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని కోరారు. విద్యతో పాటు పిల్లల ఆరోగ్యాన్ని చూసుకునే బాధ్యత అంగన్‌వాడి టీచర్లుపై ఉందన్నారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. బిసిసెల్ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గంధం రంజిత్, నాయకులు సురేందర్‌గౌడ్, వెంకటేష్‌సాగర్, రాజగౌడ్, మహేష్‌గౌడ్, సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, ఉపసర్పంచ్ కృష్ణ,  ప్రభావతి, గర్భిణీలు, బాలింతలు, ఎఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

Related Stories: