పసిడి బాక్స్…నిజాం నిజాలు

పురానీహవేలీ మసరత్‌మహల్‌లోని నిజాం మ్యూజియం లో చోరీ కేసును దక్షిణ మండల, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. మ్యూజియంలో ఈ నెల 3న ఇద్దరు యువకులు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై టాస్క్‌ఫోర్స్, దక్షిణ మండల పోలీసులు సంయుక్తంగా 20 బృందాలను రంగంలోకి దిం పి విచారణ చేపట్టారు. మహ్మద్ గౌస్ పాషా అలియాస్ ఖూనీ గౌస్, మహ్మద్ మోబీన్‌ని అరెస్టు చేసి చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు మ్యూజియం […]

పురానీహవేలీ మసరత్‌మహల్‌లోని నిజాం మ్యూజియం లో చోరీ కేసును దక్షిణ మండల, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. మ్యూజియంలో ఈ నెల 3న ఇద్దరు యువకులు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై టాస్క్‌ఫోర్స్, దక్షిణ మండల పోలీసులు సంయుక్తంగా 20 బృందాలను రంగంలోకి దిం పి విచారణ చేపట్టారు. మహ్మద్ గౌస్ పాషా అలియాస్ ఖూనీ గౌస్, మహ్మద్ మోబీన్‌ని అరెస్టు చేసి చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో అసలు మ్యూజియం ఎలా ఏర్పాటయింది? దొంగలు ఎత్తుకెళ్లిన బంగారు టిఫిన్ బాక్స్,కప్పుసాసర్ తో నిజాంకు ఉన్న అనుబంధం ఏంటీ తదితర విశేషాలను, నిజాం మునిమనవడు, నవాబ్ నజఫ్ అలీఖాన్ ఇలా వివరించారు.
“మా తాతగారికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువులు చోరీకి గురిఅవ్వడం మా కుటుంబాన్ని తీవ్రంగా బా ధించింది. హైదరాబాద్ నగ ర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును ఛేదించి, విలువైన వస్తువులను తిరిగి స్వాధీ నం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ”
అవన్నీ బహుమతులు
ఏడవ నిజాం మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహుదూర్ సిల్వర్ జూబ్లీ వేడుకలు 1936లో జరిగాయి. ఆ సమయంలో పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాలులో సామంతులు, నవాబులు,ఇతరదేశాల ప్రతినిధులు ఆయనకు ఎన్నో జ్ఞాపికలు, విలువైన బహుమతులను అందించారు. తనకు లభించిన బహుమతులు, కళాఖండాలు జనం చూడటం కోసం ప్రదర్శించాలని నిజాం అనుకున్నారు. ప్రజలకు నిజాం పాలన, సంస్కతి, సంప్రదాయాలు తెలిసేలా మ్యూజియం ఆవిర్భవించింది.
రూ.కోట్ల విలువైన చారిత్రక వస్తువులు
నిజాం మ్యూజియం చార్మినార్ సమీపంలోని పురానీహవేలిలో ఉంది. గతంలో ఇది నిజాంల ప్యాలెస్‌గా ఉండేది. అనంతరం నిజాం ట్రస్టు ఆధ్వర్యంలో 2000 ఫిబ్రవరి 18న మ్యూజియం గా మార్చారు. అక్కడ నిజాంకు చెందిన వస్తువుల విలువ సుమారు రూ.400 కోట్లు ఉండవచ్చు. పురావస్తు శాఖ నిపుణులతో అంచనా వేయిస్తే ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది.
నిజాంకు ఇష్టమైనవి…
మ్యూజియంలో ఉన్న ప్రతీ వస్తువుతో నిజాంకు అనుబంధం ఉంది. ఫలానా వస్తువే ఇష్టమైనది అని చెప్పడానికి లేదు. నిజాం వినియోగించిన దుస్తులతో పాటు పలురకాల సెంట్లు, పాదరక్షలు, టోపీలు, బ్యాగులు ఉన్నాయి. సిక్కులు, రోమన్ కాథలిక్కులు, ఇతర మతస్తులు నిజాంకు బహుకరించిన బంగారు, వెండి కళాఖండాలు ఉన్నాయి. నిజాంకు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించినప్పుడు బంగారు తాపీలు, డబ్బాలు బహుకరించా రు. ఉస్మానియా ఆర్ట్ కళాశాల భవనం, మొజంజాహీ మార్కెట్ , నాంపల్లి రైల్వేస్టేషన్, హైకోర్టు, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రి తదితర కట్టడాల నమూనాలను వెండితో తయా రు చేయించి, ఆయనకు బహుమతులుగా వాటిని అందజేశారు. ఇవి సుమారు 500 వరకు ఉంటాయి.
నిత్యం నిజాం వాడిన వాటిల్లో ముఖ్యమైనది మేడమీదకు వెళ్లే లిఫ్ట్ ఒకటి. గిలకబావిపై చెక్కతో చేసిన చక్రంలా ఉండే లిప్టును పైకి, కిందకు వచ్చేలా తాళ్లతో లాగే మ్యానువల్ లిప్టును తయారు చేశారు. నిజాం ఆ లిఫ్టులో మస్రత్‌మహల్ పైఅంతస్తుకు వెళ్లి వచ్చేవారు.150 ఏళ్లనాటి ఈ లిఫ్ట్ కూడా మ్యూజియంలో ఉంది.
నిజాం దుస్తులు భద్రపరుచుకోవడానికి టేకుతో రూపొందించిన అతిపెద్ద అల్మారా కూడా విశిష్టమనదే, ఇదివిశాలంగా ఉండి, సుమారు 140 అరలు ఉన్నాయి. నిజాం ఎక్కువగా వాడిన రోల్స్ రాయ్స్, జాగ్వర్ మార్క్ కార్‌లు ఇప్పటికీ, ఫలక్‌నుమా ప్యాలెస్ వెనుక భాగంలో ఉన్నాయి.
ప్రజలకు దగ్గరగా
ఆ రోజుల్లో ప్రపంచ కుబేరుల్లో ఒక్కడిగా పేర్గాంచిన నిజాం సామాన్య ప్రజలకు దగ్గరగా, ఆడంబరాలకు దూరంగా కింగ్‌కోఠీలో జీవించారు. ఒక సారి నిమ్స్ ఆసుపత్రిలో రోగులను చూడడానికి వెళ్లినపుడు ఒక పేదవాడు తీవ్రమైన మోకాలి నెప్పి తో బాధపడటం గమనించాడు. దానికి ఇక్కడ చికిత్సచేసే పరికరాలు లేవని పుణేకి పంపించాలని అప్పటి డాక్టర్ రంగారెడ్డి నిజాంకి వివరించారు. వెంటనే చికిత్సకు అవరమైన ఆధునిక పరికరాలను రప్పించి పేదలకు వైద్యం అందేలా చేశారు. నిమ్స్‌ని ఒక్క రూపాయి లీజుకే ప్రభుత్వానికి అప్పచెప్పారు.
శిథిలావస్థలో చెక్కమెట్లు
వందల ఏళ్ల క్రితం నాటి విలువైన వస్తువులు నిజాం మ్యూజియంలో ఉంటున్నాయనే విషయం అందరికీ తెలుసు. ట్రస్ట్ నిర్వాహకులు సరైన భద్రత కల్పించక పోవడం, అంతులేని నిర్లక్ష్యం వల్ల ఈ చోరీ జరిగింది. పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశాం. మ్యూజియంలో అడుగు పెడిత,ే శిధిలావస్తలో ఉన్న చెక్కమెట్లు దర్మణమిస్తాయి…దీని బట్టే అర్థమవుతుంది ఇక్కడి నిర్లక్ష్యం.” అని ముగించారు నజఫ్ అలీఖాన్ .
హైదరాబాద్ ఘన చరిత్రకు ఆనవాళ్లు..
ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ పాతికేళ్ల వయస్సులో 1911 ఆగస్టు 29న దక్కన్ సింహాసనాన్ని అధిష్టించారు. 1911 నుంచి 1948 సెప్టెంబరు 17 వరకు, దక్కన్ సంస్థానాన్ని ఆయన పాలించారు. 1937 నాటికి తన పాలన 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహించినపుడు దేశ, విదేశీ రాజకీయ ప్రముఖులు, దక్కన సంస్థానంలోని జాగీర్‌దారులు, సామంతులు, అతిథులతో పాటు సాధారణ జనం హాజరయి ఆయనకు విలువైన, అరుదైన కళాఖండాలను బహుమతులుగా ఇచ్చారు. వాటినే మ్యూజియంలో ఉంచారు. హైదరాబాద్ నగర చారిత్రక ఆనవా ళ్ళు ఇక్కడున్నాయి. బంగారపు పూ తతో చేసిన సింహాసనం, అత్తరు కోసం అత్యద్భుతంగా చెక్కిన వెండి సీసాలు, నిజాంకు భద్రాచలం పాల్వంచరాజులు బహుకరించిన సిల్వర్ అత్తర్, మైసూర్ రాజులు ఇచ్చిన ఏనుగు దంతాలతో చేసిన చార్మినార్, ఫ్రాన్సు లో తయారైన టీకప్పులు, లండన్‌లో చేసిన కాఫీసెట్, బస్రా పట్టణం అతిపెద్ద సైజులోని ముత్యంతో చేసిన వాకింగ్ స్టిక్.. ఇలా ప్రతీ వస్తువుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. దక్కన్ చరిత్రను కళ్లకు కట్టినట్లు విశదీకరిస్తుంటా యి. ఈ మ్యూజియం 1750లో రెండో నిజాం.. అలీఖాన్ నిర్మించిన మస్రత్ మహల్ భవన సముదాయంలో ఉంది.

నిజాంకు ఉన్న అనుబంధం ఇదీ…

నిజాం వ్యక్తిగతంగా వాడే, వస్తువుల్లో ప్రధానమైనది టిఫిన్ బాక్స్. దీనిని పూర్తిగా బంగారంతో చేసి, వజ్ర వైఢ్యూర్యాలు పొందుపరిచారు. ఇది కిలోల బరువు ఉంటుంది. అలాగే కప్పు,సాసర్, బంగారు స్పూన్. వీటిని నిజాం నిత్యం వాడేవారు. టిఫిన్ బాక్స్‌లో ఆహారం తీసుకెళ్లేవారు.

Comments

comments

Related Stories: