పసిడి పోరుకు పి.వి సింధు

జకార్తా: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పి.వి.సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సింధు జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిను ఓడించి తుది పోరుకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన సమరంలో మూడో సీడ్ సింధు 2117, 1521, 2110 తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో సింధు రజత పతకం ఖాయం చేసుకుంది. మరోవైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. తొలి సెమీస్‌లో సైనా ప్రపంచ నంబర్‌వన్, చైనీస్‌తైపికి చెందిన […]

జకార్తా: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పి.వి.సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సింధు జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిను ఓడించి తుది పోరుకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన సమరంలో మూడో సీడ్ సింధు 2117, 1521, 2110 తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో సింధు రజత పతకం ఖాయం చేసుకుంది. మరోవైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. తొలి సెమీస్‌లో సైనా ప్రపంచ నంబర్‌వన్, చైనీస్‌తైపికి చెందిన తై జుయింగ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో సైనా కేవలం కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, యమగూచితో జరిగిన పోరులో భారత అగ్రశ్రేణి షట్లర్ సింధు అసాధారణ ఆటను కనబరిచింది. ప్రారంభం నుంచే తన మార్క్ ఆటతో చెలరేగి పోయింది. తొలి గేమ్‌లో సింధు జోరు కొనసాగింది. చూడచక్కని షాట్లతో అలరించిన సింధు ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. మరోవైపు యమగూచి కూడా పట్టు వదలకుండా పోరాడింది.

సింధు ఆధిక్యాన్ని తగ్గించుకుంటూ పైచేయి సాధించేందుకు ప్రయత్నించింది. అయితే కీలక సమయంలో పుంజుకున్న సింధు 2117తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ప్రారంభంలో కూడా సింధు ఆధిక్యాన్ని అందుకుంది. అయితే వరుస తప్పిదాలకు పాల్పడుతూ చేజేతులా ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చింది. సింధు పొరపాట్లను తనకు అనుకూలంగా మార్చుకున్న యమగూచి అలవోకగా సెట్‌ను గెలుచుకుని స్కోరును సమం చేసింది. ఇక, ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో గేమ్‌లో సింధు తన విశ్వరూపాన్ని కనబరిచింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన సింధు లక్షం దిశగా అడుగులు వేసింది. అసాధారణ షాట్లతో యమగూచికి ముచ్చెమటలు పట్టించింది. సింధు చెలరేగి ఆడడంతో జపాన్ స్టార్ కనీస పోటీ ఇవ్వలేక పోయింది. చివరి వరకు దూకుడును కనబరిచిన సింధు 2110తో సెట్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో తై జుయింగ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తన ఖాతాలో పసిడి పతకాన్ని జమచేసుకోవాలని సింధు తహతహలాడుతోంది.

Related Stories: