పసికందు దొరికింది…

Born baby found who is kidnapped in RIMS in Adilabad

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ డెలివరీ వార్డ్‌లో మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పసికందు కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే, పసికందు కిడ్నాప్ కేసులో మిస్టరీని పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇచ్చోడలో శిశువును ఎత్తుకెళ్లిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేకపోవడంతో పసికందును ఎత్తుకెళ్లినట్లు సదరు మహిళ అంగీకరించింది. బాలుడిని పుష్పలత, నగేష్ అనే దంపతులు అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. నేరేడుగొండ చెక్‌పోస్ట్ వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు.