పవన్ పై అంబటి రాంబాబు ఫైర్…

అమరావతి: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ తనకు తానే మంచి వ్యక్తినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని చెప్పారు. పవన్ కనుక జగన్ స్థానంలో ఉండి ఉంటే ఎపి ప్రభుత్వాన్ని ఓ ఊపు ఊపేసేవాడినన్న పవన్ విమర్శలపై ఆయన రీ కౌంటర్ ఇచ్చారు. ఓ ఊపు ఊపేయాలని పవన్ కు ఉంటే 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ […]

అమరావతి: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ తనకు తానే మంచి వ్యక్తినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని చెప్పారు. పవన్ కనుక జగన్ స్థానంలో ఉండి ఉంటే ఎపి ప్రభుత్వాన్ని ఓ ఊపు ఊపేసేవాడినన్న పవన్ విమర్శలపై ఆయన రీ కౌంటర్ ఇచ్చారు. ఓ ఊపు ఊపేయాలని పవన్ కు ఉంటే 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు..? రాజ్యసభలో సభ్యత్వం ఇవ్వలేదని బయటకొచ్చారా..? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు పవన్ సమాధానం ఇవ్వాలని అంబటి డిమాండ్ చేశారు. ఓటుకు నోటు, కాల్ మనీ అంశాలపై సిఎం చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు..? ప్రశ్నించడంలో విఫలం అయితే పాలించడంలోనూ ఫెయిల్ అవుతారని పవన్ కి చురకలంటిచారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానన్నపవన్ ఎక్కడికెళ్లారు..? ఎపికి ప్రత్యేక హోదా సాధన పై చిత్తశుద్ధి ఉందన్న పవన్ కళ్యాణ్, బంద్ కు ఎందుకు మద్దతివ్వలేదు..? విజయమ్మను రోడ్లపై తిప్పుతున్నాడంటూ జగన్ పై వ్యక్తిగత విమర్శలు పవన్ చేయలేదా..? అని ప్రశ్నించారు.

Related Stories: