పల్లెల ప్రగతే కెసిఆర్ లక్ష్యం

మహబూబ్‌నగర్: ప్రతి క్షణం పేద ప్రజల గురించి ఆలోచించే సిఎం కెసిఆర్‌కు అండగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని వీరన్న పల్లి గ్రామంలో రూ.16లక్షల వ్యయంతో చేస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.5లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్ టి కమ్యూనిటీ భవనానికి ఆయన భూమిపూజ చేశారు. రాంనాయక్ తండాలో రూ.61లక్షలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. దొండపల్లిలో ఆత్మహత్య […]

మహబూబ్‌నగర్: ప్రతి క్షణం పేద ప్రజల గురించి ఆలోచించే సిఎం కెసిఆర్‌కు అండగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని వీరన్న పల్లి గ్రామంలో రూ.16లక్షల వ్యయంతో చేస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.5లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్ టి కమ్యూనిటీ భవనానికి ఆయన భూమిపూజ చేశారు. రాంనాయక్ తండాలో రూ.61లక్షలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. దొండపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి లక్ష్మారెడ్డి ఆర్థిక సహాయం అందజేసి, దొండపల్లి గ్రామంలో టిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పల్లెల ప్రగతే టిఆర్ఎస్ సర్కార్ ప్రధాన లక్ష్యమన్నారు. పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలని కొనియాడారు. పల్లెలను దృష్టిలో పెట్టుకొనే కెసిఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలియజేశారు. అందుకే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే తండాలలో స్వరాజ్య స్థాపన జరుగుతుందని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లనే తెలంగాణకి అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు.

Related Stories: