పల్లెపల్లెకు తెలుగుదేశం

మన తెలంగాణ/నర్సంపేట రూరల్ : రాబోయే శాసనసభ ఎన్నికల్లో, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ పొలీట్‌బ్యూరో సభ్యుడు , మాజీ ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాదన్నపేట గ్రామంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలపార్టీ అధ్యక్షుడు ఎర్ర యాకూబ్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని మాదన్నపేట, ఇటుకాలపెల్లి, ముత్తోజిపేట, రాజిపేట, చంద్రయ్యపల్లి, దాసరిపల్లి గ్రామాలకు చెందిన టిడిపి గ్రామ కమిటీ, […]

మన తెలంగాణ/నర్సంపేట రూరల్ : రాబోయే శాసనసభ ఎన్నికల్లో, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ పొలీట్‌బ్యూరో సభ్యుడు , మాజీ ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాదన్నపేట గ్రామంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలపార్టీ అధ్యక్షుడు ఎర్ర యాకూబ్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని మాదన్నపేట, ఇటుకాలపెల్లి, ముత్తోజిపేట, రాజిపేట, చంద్రయ్యపల్లి, దాసరిపల్లి గ్రామాలకు చెందిన టిడిపి గ్రామ కమిటీ, తెలుగుయువత మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమం చేపట్టామన్నారు. గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. కమిటీ సభ్యుల పనితీరు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, అధికార పార్టీ వైఫల్యాలు సమీక్ష సమావేశంలో సభ్యులకు వివరించడం జరుగుతుందన్నారు. పల్లె ప్రగతి పేరుతో టిఆర్‌ఎస్ పార్టి కి చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి 500 కోట్లు తెచ్చామని ప్రతీ గ్రామంలో 50 లక్షలతో అభివృద్ది పనులు చేస్తామని కార్యకర్తలతో పనులు చేయించి మభ్యపెట్టేప్రయత్నం చేస్తుందన్నారు. ఎంఎల్‌ఎ దొంతి మాదవరెడ్డి కాంట్రాక్టు పనులతో దోపిడికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. టిడిపి బడుగు, బలహీన వర్గాలకు చెందిన పార్టి అని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టి నలుగురు కుటుంబ సభ్యులకు చెందిందని ఆయన ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గానికి పాకాల సరస్సులోకి గోదావరి జలాలు తెప్పిస్తానని పెద్ది కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడన్నారు. 2008లో తాము చేపట్టిన గోదావరి జలాల కోసం పాదయాత్ర చేపట్టానని అప్పుడే ఫోర్త్ ఫేస్ పనులు పూర్తి అయి గోదావరి నీళ్లు తెప్పించిన విషయం పెద్ది మరిచిపోయాడన్నారు. తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజాసేవకోసమే వచ్చానని ఆయన తెలిపారు. ఎంఎల్‌ఎగా బినామి కాంట్రాక్టులు చేస్తు ప్రజాదనాన్ని దోచుకుంటున్న దొంతి మాదవరెడ్డి అదికార పార్టిలో ఉండి అభివృద్ది పట్టని పెద్ది అసమర్దతను తాను చేసిన అభివృద్దిపై ప్రజల్లో చర్చపెట్టేందుకే ఈకార్యక్రమం చేపట్టానని అన్నారు. రాజకీయ నిబద్దత కలిగిన తెలుగుదేశం పార్టిలోనే తాను కొనసాగుతానని , ఆపార్టి గుర్తుతోనే రాజకీయ జన్మనిచ్చిన నర్సంపేట నియోజకవర్గంనుండే పోటీ చేస్తానని ఎవ్వరు అపోహలకు గురికావద్దని అన్నారు. నర్సంపేట రూపురేఖలు మార్చే శక్తి తనకు మాత్రమే ఉందని వచ్చే ఎన్నికల్లో తనను ఎంఎల్‌ఎగా గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన దీమా వ్యక్తం చేశారు. పార్టి కార్యకర్తలకు అండగా ఉంటానని తెలంగాణ గడ్డపై టిడిపి ఆవిర్బవించిందని ఆర్దికంగా సామాజికంగా , రాజకీయంగా తెలంగాణ ప్రజలకు తెలుగుదేశం పార్టి హాయాంలోనే న్యాయం జరిగిందని ఆయన వివరించారు. పార్టి బలోపేతంపై దృష్టిపెట్టి యువత , మహిళ కమిటీలను పటిష్టం చేయాలని యువత వలనే మార్పు సాద్యమౌతుందని ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రదాన కార్యదర్శి అజ్మిర శ్రీనివాస్, నాయకులు వేముల బొందయ్యగౌడ్, గాదగోని సుదర్శన్, కొయ్యటి సంపత్, దూపటి ఆనంద్, వెంకటేశ్వర్లు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: