పర్సులో పేలిన మొబైల్..!

అమరావతి: అంగన్‌వాడీ కార్యకర్తకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ పర్సులోనే పేలిపోయిన సంఘటన ఎపిలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం బోయ వీధిలో జరిగింది. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త యల్లవతి పర్సులోని మొబైల్ పేలిపోయింది. అసలేం జరిగిందో కూడా తనకు తెలియలేదని, చూస్తుండగానే పర్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు కార్యకర్త తెలిపింది. దీంతో పర్సులో ఉన్న రూ. 2600 కూడా కాలిపోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు గాను కార్బన్‌ సంస్థకు చెందిన […]

అమరావతి: అంగన్‌వాడీ కార్యకర్తకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ పర్సులోనే పేలిపోయిన సంఘటన ఎపిలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం బోయ వీధిలో జరిగింది. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త యల్లవతి పర్సులోని మొబైల్ పేలిపోయింది. అసలేం జరిగిందో కూడా తనకు తెలియలేదని, చూస్తుండగానే పర్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు కార్యకర్త తెలిపింది. దీంతో పర్సులో ఉన్న రూ. 2600 కూడా కాలిపోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు గాను కార్బన్‌ సంస్థకు చెందిన ఫోన్లను ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ మొబైల్స్ ఇలా ప్రమాదకరంగా పేలిపోతుండడంతో ఐసిడిఎస్‌ సిబ్బంది భయపడుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఫోన్లు పేలడం ఇది రెండో ఘటన. ఇంతకుముందు 2 నెలల క్రితం కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి అంగన్‌వాడీ కార్యకర్త అనురాధ ఫోన్‌ కూడా చార్జింగ్‌ పెట్టిన సమయంలో పేలిపోయింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు భయాందోళనలకు గురవుతున్నారు.

Comments

comments