పర్యావరణ పరిరక్షణే మా ధ్యేయం

ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు చాలా పెరిగిపోతుంది. దానికి తోడు ఈ మధ్యకాలంలో మనం నిత్యం తినే ఆహారపదార్థాల్లో కూడా ప్లాస్టిక్ కలుస్తుందని పలువురు వైద్యనిపుణులు తెలుపుతున్నారు. ప్లాస్టిక్ వాడకం పెరుగుతున్నకొద్దీ మనకు ప్రాణహాని కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ బ్యాగు భూమిలో కరగడానికి 500 సంవత్స రాల సమయం పడుతుంది. ఒక టన్ను పేపర్‌ని రీస్లైకింగ్ చేయడం ద్వారా సుమారు 17 చెట్లను రక్షించినట్టవుతుంది. అదే ఒక ప్లాస్టిక్ బాటిల్‌ని రీస్లైక్లింగ్ చేయడం వల్ల 60 వాట్ల విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ప్రతిఒక్కరు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నగరానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ చేస్తున్న ప్రయత్నం గురించి తెలుసుకుందాం…

మన ఇంట్లో ఉండే చెత్తకు సంబంధించిన ఉపయోగాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా, మ్బైల్ యాప్ ద్వారా వివరిస్తున్నారు. అంతే కాకుండా ఒక్క మిస్డ్‌కాల్ ఇస్తే మీ ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి రీసైక్లింగ్ చేస్తామంటున్నారు. స్క్రాప్‌క్యూ స్టార్టప్ వ్యవస్థాపకులు బిందు, లత, రీతూలు చెబుతున్నారు. ఇంట్లో ఓ మూలన పడేసే పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కొనుగోలు చేసి ఇంటి స్వచ్ఛతతో పాటు ఆర్థికంగానూ బాసటగా ఉంటున్నారు వీరు. ఈ చెత్త రీసైక్లింగ్ కోసం ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. హ్యాపీ స్మైల్ ఫౌండేషన్‌కు విరాళాలిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు.
చెత్తతో ప్రయోజనాలపై అవగాహన..
మాములుగా ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు నిత్యం అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అంటే దానికి ముఖ్యకారణం ఇంట్లో ఉండే చెత్త వల్ల అని డాక్టర్లు చెబుతుంటారు. వర్షాకాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో శుభ్రతకు ఈ చెత్త ఎప్పుడూ అడ్డే. నగరంలో ఎక్కువ మంది అద్దెదారులే. దీంతో ఆ చెత్తను ఉన్న ఇంట్లోనే ఓ మూలన పెడుతుంటారు. చెత్త కొనేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇంకొందరు వీలు చూసుకుని స్క్రాప్ దుకాణం ఎక్కడో వెదుక్కొని మరీ ఈ చెత్తను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అయితే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నగరంలో చెత్తను ఎక్కడిపడితే అక్కడ పడేయడం వల్ల కలిగే అనర్థాలను, రీసైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను బిందు, లత, రీతూ ప్రజలకు వివరించి వారిలో అవగాహన కార్యక్రమాల ద్వారా మార్పును తీసుకొస్తున్నారు. ‘మొదట సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనుకున్నారు. ఆ తర్వాత కాలనీల్లో నివసించే ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చివరకు ఇంటి ఇంటికీ వెళ్లి చెత్త గొప్పతనాన్ని వారికి తెలియజేస్తూ వాటిని పడేయవద్దని చెబుతున్నారు స్క్రాప్ క్యూ సంస్థ. ప్రజలలో ప్రతి ఒక్కరికి తేలిసేవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్ వాడుతున్నారు కాబట్టి వీరు ఎక్కువ శాతం ఫేస్‌బుక్‌లో ప్రచారం చేయడం ద్వారా వీరికి నెటిజన్‌ల నుంచి, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.
ఒక్క మిస్డ్ కాల్‌తో మీ ఇంటికి ….
ఇంట్లో పేరుకుపోయిన చెత్త ప్లాస్టిక్ పేపర్లు, పాత పుస్తకాలు, న్యూస్ పేపర్లు, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్‌కి సంబంధించిన వ్యర్థాలు ఉంటే 040-30707070 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే స్క్రాప్‌క్యూ సిబ్బంది మీరు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో వచ్చి డబ్బులు చెల్లించి చెత్తకొంటారు అని చెబుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘స్క్రాప్‌క్యూ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేయాలని వివరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలని, మన చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రం గా ఉంటే మనకు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్‌వైపు అడుగులు వేస్తు క్లీన్ ఇండియాగా పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.

Comments

comments