పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే వాడండి

నిర్మల్‌: వచ్చే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతీ ఒకరు మట్టి గణపతులను వాడి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర గృహా నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవార నిర్మల్ పట్టణంలోని టిఎన్‌జిఒ కార్యాలయ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ, జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న మట్టి గణపతుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]


నిర్మల్‌: వచ్చే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతీ ఒకరు మట్టి గణపతులను వాడి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర గృహా నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవార నిర్మల్ పట్టణంలోని టిఎన్‌జిఒ కార్యాలయ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ, జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న మట్టి గణపతుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగులతో కూడిన గణపతులు వాడటం వలన వాతావరణం కాలుషితమవుతుందని అందువలన మట్టితో తయారు చేసిన గణపతులు వాడేల ప్రజల్లో అవగాహణ కల్పించారు. ఫ్లాస్టిక్ వాడకుండ కాగితం, జనూపనారతో కల్పించాలన్నారు. అడవులు ఉన్న చోటే వర్షలు కురుస్తున్నాయని, పర్యవరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం హరితహరం కార్యక్రమంలో ప్రతీ సంవత్సరం 100 కోట్ల మొక్కలను నాటాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మట్టి గణపతులు, దీపంతల తయారీలో శిక్షణ పొందిన శాలివాహన కుమ్మరులకు దృవీకరణ పత్రాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌ చక్రవర్తి, ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కో ఆర్డినేటర్ నల్ల వెంకట్‌రామ్‌రెడ్డి, ఆడెల్లి ఆలయ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నిర్మల్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.