పర్యాటకుల సుందర స్వప్నం వండర్‌ లా

చిత్రవిచిత్రాలతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆటవిడుపును కలిగించే అమ్యూజ్‌మెంట్ పార్కు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో అందరికి అందుబాటులో ఉండి మరో ప్రపంచాన్ని చుట్టివచ్చిన అనుభూతిని కల్గిస్తోంది. పొద్దస్తమానం పాఠాలు, చదువులు, హోంవర్క్‌లు అంటూ అలిసిపోయిన చిన్నారులను తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలనుకునే తల్లిదండ్రులకు ఈ పార్క్ సరైన ఛాయిస్.   భారతదశంలోనే నెంబర్‌వన్ వినోద పార్కుల నిర్వహణ సంస్థ వండర్‌లా హాలిడేస్ ఔటర్ రింగ్‌రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర రావిరాలలో 50 ఎకరాల సువిశాల ప్రాంతంలో […]

చిత్రవిచిత్రాలతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆటవిడుపును కలిగించే అమ్యూజ్‌మెంట్ పార్కు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో అందరికి అందుబాటులో ఉండి మరో ప్రపంచాన్ని చుట్టివచ్చిన అనుభూతిని కల్గిస్తోంది. పొద్దస్తమానం పాఠాలు, చదువులు, హోంవర్క్‌లు అంటూ అలిసిపోయిన చిన్నారులను తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలనుకునే తల్లిదండ్రులకు ఈ పార్క్ సరైన ఛాయిస్.  

భారతదశంలోనే నెంబర్‌వన్ వినోద పార్కుల నిర్వహణ సంస్థ వండర్‌లా హాలిడేస్ ఔటర్ రింగ్‌రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర రావిరాలలో 50 ఎకరాల సువిశాల ప్రాంతంలో విస్తరించి ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వండర్‌లాపార్కు 15 నిమిషాల ప్రయాణదూరంలో ఉండటం విశేషం. 250 కోట్లకు పైగా ఖర్చుతో అద్భుతమైన పార్కును 2016 అందుబాటులోకి తెచ్చింది. వండర్‌లాలో 43 విశిష్ట రైడ్లు వున్నాయి. 25 ల్యాండ్‌బేస్ట్ , 18 వాటర్ బేస్ట్‌లున్నాయి. ప్రతి రోజు పదివేల మంది అతిథులకు ఆహ్లాదాన్ని అతిథ్యాన్ని అందించే సామర్థం కలిగివుంది.
లాండ్ వాటర్ రైడ్స్:
దేశంలో మొదటిసారిగా రివర్స్ రూపింగ్ రోలర్ కోస్టర్ పర్యాటకులను అలరిస్తుంది. రికాయిల్ పేరుతో పిలువబడే కోస్టల్ 40 ఫీట్ల ఎత్తు ఆరు రౌండ్ల ఇన్వర్షన్ సౌలభ్యం కలిగి ఉంది. హైద్రాబాద్ వండర్‌లా పార్కును అతిథుల కోసం నెదర్లాండ్స్ నుండి ప్రత్యేకంగా తెప్పించారు. రక్షణ పరంగా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటున్నామని త్వరలో మరిన్ని విశిష్టతలను జోడిస్తామని, హైద్రాబాద్ నగరవాసులతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి వండర్‌లాను పెద్ద ఎత్తున వీక్షిస్త్తూ వినోదాన్ని పొందుతున్నారని వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ చిట్టిల పిళ్లై మనతెలంగాణకు వివరించారు.
దేశంలో మొదటిసారిగా వండర్‌లా అంతరిక్ష అనుభూతి
2017లో నూతన ఆకర్షణగా మిషన్ ఇంటర్ స్టెల్లర్‌ను పార్కు అందుబాటులోకి తెచ్చింది. మిషన్ ఇంటర్‌స్టెల్లర్ పలు సాంకేతిక విశిష్టతలను కలిగి వుండి గ్రహాంతరాలకు వెళ్లినట్లు, వినీలాకాశంలో విహరించినట్లు అంతరిక్ష అనుభూతిని కలిగిస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తెచ్చిన మిషన్ ఇంటర్ స్టెల్లర్ కోసం వండర్ సంస్థ రూ.40 కోట్లు వెచ్చించింది. యూరప్‌నకు చెందిన ప్రఖ్యాత థీమ్‌పార్కు డిజైన్ కంపెనీలతో కలిసి ఈ అద్భుతమైన అనుభూతిని అందించే సౌకర్యం కల్పించింది. 350 చదరపు అడుగుల పారాబోలిక్ స్క్రీన్, 4 కె రిజల్యూషన్ లేజర్ ప్రొజెక్టర్ ఇటలీ నుండి దిగుమతి చేసుకున్న హైడ్రాలిక్ లిఫ్ట్ సెట్టింగ్ సిస్టం 60 పాక్స్ తో స్పేస్‌లో విహరింపజేస్తుంది. అతిథులు సవారి చేసే వాహనం డోమ్‌లో 40 ఫీట్లు వరకు పైకి తీసుకెళ్తుంది.

హైద్రాబాద్‌తో పాటు బెంగళూర్, కొచ్చిలోనూ వండర్‌లా పార్కులు
82 ఎకరాల్లో విస్తరించి వున్న వండర్‌లా బెంగళూర్ 62 ల్యాండ్, వాటర్, కిడ్స్‌రైడ్‌లతో అతిథులను ఆకర్షిస్తోంది. వండర్‌లా రిసార్టులో 84 లగ్జరీ గదులు, మల్టీ క్విజ్ రెస్టారెంట్, రెస్ట్రాబార్, హీటెడ్ , స్విమ్మింగ్‌పూల్, కిడ్ అక్టివిటిసెంటర్, అద్భుతమైన జిమ్ , 4 సువిశాలమైన బాంకెట్స్ హాల్స్ వున్నాయి. వండర్‌లా కొచ్చిలో 35 ఎకరాల స్థలంలో విస్తరించి అన్ని వయసుల వారికి అలరించే సదుపాయాలను కలిగివుంది. 58 స్టేట్ ఆఫ్ ఆర్ట్ రైడర్స్‌తో పాటు ఎన్నో విశిష్టతలు ఇందులో ఉన్నాయి. దేశంలో నెంబర్ వన్ అత్యుత్తమ పార్కుగా గుర్తింపు పొందిన వండర్‌లా ఆసియాఖండంలో 6 వ అద్భుతమైన అమ్యూజ్‌మెంట్ పార్కుగా గుర్తింపును దక్కించుకుంది.                                                                                                          – కె.జగన్ రెడ్డి