పరువు నిలిచేనా?

నేడే ఓవల్‌లో తుది టెస్టు లండన్: సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో 60 పరుగుల తేడాతో భారత్ నాలుగో టెస్టులో ఓడిపోయింది. దాంతో ఇంగ్లాండ్ జట్టుకు ఐడు టెస్టుల సిరీస్‌లో 31 ఆధిక్యత లభించింది. లండన్‌లో శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య తుది ఐదో టెస్టు జరగనున్నది. ఓటములతో కూనరిల్లిన టీమిండియా చివరగా ఓదార్పు(కన్సోలేషన్) గెలుపునైనా సాధించాలన్న పట్టుదలతో ఉంది. తన సుదీర్ఘ పర్యటనకు పాజిటివ్ ముగింపు ఇవ్వాలనుకుంటోంది. ఐదు టెస్టుల్లో కనీసం 2 గెలిచినా […]

నేడే ఓవల్‌లో తుది టెస్టు

లండన్: సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో 60 పరుగుల తేడాతో భారత్ నాలుగో టెస్టులో ఓడిపోయింది. దాంతో ఇంగ్లాండ్ జట్టుకు ఐడు టెస్టుల సిరీస్‌లో 31 ఆధిక్యత లభించింది. లండన్‌లో శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య తుది ఐదో టెస్టు జరగనున్నది. ఓటములతో కూనరిల్లిన టీమిండియా చివరగా ఓదార్పు(కన్సోలేషన్) గెలుపునైనా సాధించాలన్న పట్టుదలతో ఉంది. తన సుదీర్ఘ పర్యటనకు పాజిటివ్ ముగింపు ఇవ్వాలనుకుంటోంది. ఐదు టెస్టుల్లో కనీసం 2 గెలిచినా స్కోరు లైన్ మెరుగా ఉందనిపించగలదు. కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఈ తుది టెస్టు అలస్టేయిర్ కుక్‌కు విడ్కోలు(ఫేర్‌వెల్) టెస్ట్. భారత జట్టు మనోనిబ్బరాన్ని ప్రోదిచేసేలా చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రయత్నిస్తున్నాడు. ‘గత15 ఏళ్లలో ఇదే ఉత్తమ పర్యటన’ అని వ్యాఖ్యానించాడు.

సింహావలోకనం…
గణాంకాల ప్రకారం చూస్తే సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2002లో జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, 200304లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ పేలవంగా ఉన్నాయి. వెస్టిండీస్‌తో ఆడిన టెస్ట్ సిరీస్, పాకిస్థాన్‌తో ఆడిన టెస్ట్ సిరీస్ కూడా చెప్పుకోదగ్గంతగా జరగలేదు. ఇక రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టీమిండియా 2006లో వెస్టిండీస్‌పై ట్విన్ సిరీస్ గెలిచింది. అలాగే 2007లో ఇంగ్లాండ్‌పై గెలిచింది. ఇవే కాకుండా దక్షిణాఫ్రికా టెస్ట్‌ను కూడా గెలిచింది. ఇక అనిల్ కుంబ్లే సారథ్యంలో భారత్ బౌన్సీ పెర్త్ మైదానంలో తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలిచింది. కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా న్యూజిలాండ్ సిరీస్‌ను గెలిచింది. అలాగే దక్షిణాఫ్రికాలో ఒక్కసారి మాత్రం సిరీస్‌ను డ్రా చేసుకుంది.

నిరవధిక సిరీస్‌తో…
విదేశాల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో వెంటవెంటనే సిరీస్ ఆడడంతో మంచి పర్యాటక జట్టుగా టీమిండియా పేరు తెచుకుందే తప్ప ఉపఖండం వెలుపల కూడా సత్తా చాటగలదన్నది రుజువు చేసుకోలేకపోయింది. 2018లో విదేశాల్లో రెండు టెస్ట్ సిరీస్‌లను చేజార్చుకున్నప్పటికీ భారత్ ఇప్పటికీ టెస్ట్ సిరీస్‌లో నెం. 1 ర్యాంకింగ్‌ను పదిలపరుచుకుంది.
జట్టు కాంబినేషన్‌పై దృష్టి

ఈ నేపథ్యంలో కోహ్లి సారథ్యంలో భారత జట్టు మరో టెస్టు ఆడబోతున్నది. ఈసారి జట్టు కూర్పు(కాంబినేషన్)పై మరోసారి అందరి దృష్టి కేంద్రీకృతమైంది. భారత జట్టు బెస్ట్ ఎలెవన్‌లా ఆడాలనైతే అనుకుంటోంది. అయితే అదే సమయంలో లైన్‌అప్‌లో ప్రయోగాలు కూడా చేయబోతున్నది. టెస్టు జట్టులోకి పృథ్వీ షాను తీసుకున్నారు. భారత సెలెక్టర్లు కొత్త ఓపెనర్ల లైన్‌అప్ కోసం చూస్తున్నారు. మురళీని తొలగించారు. డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఉన్నందున జట్టుపై దృష్టిని బాగా కేంద్రీకరించారు.

శిఖర్ ధవన్, కె.ఎల్. రాహుల్‌లను ఓపెనర్లుగానే కొనసాగించాలన్న సూచనలున్నాయి. ఒకవేళ సెలెక్టర్లు మరోవిధంగా యోచిస్తున్నట్టయితే ఈ ఇద్దరూ వెస్టిండీస్ సిరీస్, దేశీయ ఫస్ట్‌క్లాస్ సీజన్‌కు ముందు తమ జోడీ సత్తాను చాటాల్సి ఉంటుంది. లేదేని ఇదే వారికి చివరి ఓపెనర్ల కాంబినేషన్ కాగలదు. పృథ్వీ షాకు ఓపెనర్ అవకాశం దక్కాలంటే ఈ సీజన్ ముగియాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఏదిఎలా ఉన్నప్పటికీ భారత్ తన లోయర్ మిడిల్ ఆర్డర్, బౌలింగ్ కాంబినేషన్‌తో ఆడాలనుకుంటోంది. హార్దిక్ పాండ్య బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోతున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో హనుమ విహారిని మేనేజ్‌మెంట్ ప్రయోగాత్మకంగా ఆడించే అవకాశం కనిపిస్తోంది. హనుమ విహారి మంచి స్పిన్నర్ అన్న సంగతి కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. రవీంద్ర జడేజా పర్యటనలో తొలి టెస్ట్ ఆడనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ బుధవారం నెట్స్‌లో బౌలింగ్ చేయకుండా అరుదుగా తచ్చాడుతూ కనిపించాడు. అయితే అతడు ఆడతాడా లేడా అన్న విషయం మాత్రం మేనేజ్‌మెంట్ నుంచి ధ్రువీకరణ కాలేదు. వచ్చే వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆసియా కప్ ఆరంభం కానున్నందున జస్ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నారు. పరిమిత ఓవర్ల జట్టులో శార్దుల్ ఠాకుర్‌తో పాటు పేసర్ బుమ్రా కూడా ఉన్నాడు. ఉమేశ్ యాదవ్ పునరాగమనం సంభవమేననిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చివరి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుకు చాలా ఉద్వేగభరితం కానుంది.

కుక్ చివరి టెస్ట్
ఇంగ్లాండ్ జట్టులో బాగా ఆడే అలస్టేయిర్ కుక్‌కు ఇదే చివరి టెస్ట్ మ్యాచ్. ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. కనుక అలస్టేయిర్ కుక్ స్థానంలో కొత్త గా ఇద్దరు ఓపెనర్ల కోసం ఇంగ్లాండ్ జట్టు అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి ఐదో టెస్టులో ఆడనున్న తమ జట్టులో మాత్రం ఎలాంటి మారులు చేయలేదు. తాను రిటైర్ అవుతున్నానని కుక్ బహిరంగంగానే ప్రకటించిన నేపథ్యంలో జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. సౌతాంప్టన్‌లో రెండో ఇన్నింగ్స్‌ను తిపేసిన కీటన్ జెన్నింగ్స్‌పై ఇంగ్లాండ్ సెలెక్టర్లకు మంచి నమ్మకం ఉంది. ఒకవేళ క్రిస్ వోక్స్ మళ్లీ ఫిట్ అనిపిస్తే వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకు జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్‌లకు విశ్రాంతి ఇవ్వొచ్చనిపిస్తోంది. ఓవల్ పిచ్ బుధవారం పచ్చదనంతో కనిపించింది. ఈ సిరీస్‌లోని మిగతా పిచ్‌ల(వికెట్స్) మాదిరిగానే పచ్చగా కనిపించింది.

జట్లు
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధవన్, పృథ్వీ షా, కె.ఎల్. రాహుల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, రిషభ్ పంత్(వికెట్‌కీపర్), కరుణ్ నాయర్, జడేజా, హనుమ విహారి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్: జో రూట్(కెప్టెన్), అలెస్టేయిర్ కుక్, కీటన్ జెన్నింగ్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, ఓలివర్ పోప్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, శామ్ కరన్, జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్, క్రిసష్ ఓక్స్, బెన్ స్టోక్స్.

Related Stories: