హైదరాబాద్ : పరిపూర్ణానందస్వామికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కరణను ఎత్తివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల క్రితం ఆరు నెలల పాటు స్వామిని నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. ఈ బహిష్కరణను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం ఆయనకు అనుకూలంగా కోర్టు నిర్ణయం తీసుకుంది. హిందువుల దైవమైన శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కత్తిని కూడా నగర బహిష్కరణ చేశారు. కత్తి వ్యాఖ్యలను నిరసిస్తూ పరిపూర్ణానంద యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ పరిపూర్ణానందను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేశారు.
Relief to Paripoornananda Swami in High Court
Comments
comments