పరిపూర్ణానందకు మరోసారి బహిష్కరణ నోటీసులు

Swami Paripoornananda House Arrest in Hyderabad

హైదరాబాద్: పరిపూర్ణానందస్వామికి మరోసారి బహిష్కరణ నోటీసులు అందాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధి నుంచి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు బహిష్కరించారు. నోటీసులు ఇవ్వడానికి పోలీసులు కాకినాడకు వెళ్లారు. గ్రేటర్ పరిధిలో ఆరు నెలల పాటు పూర్ణానంద స్వామి ఎక్కడా అడుగు పెట్టకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ పరిపూర్ణానంద గ్రేటర్ హైదరాబాద్ లోకి ప్రవేశిస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కత్తి మహేశ్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నగర బహిష్కరణ గురైన విషయం తెలిసిందే.

2017 నవంబర్ 1న మెదక్ జిల్లా రాష్ట్రీయ హిందూ సేన అవిర్భావ సభలో మాట్లాడిన స్వామీజీ, ముస్లింలకు, క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు డబ్బిస్తున్న ప్రభుత్వాలు ప్రజాధనాన్ని సబ్సిడీలుగా మారుస్తున్నాయని, హిందువులకు మాత్రం పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు డబ్బివ్వకుండా, సర్ చార్జీలను పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపించారని, తమ విచారణలో ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలని తేలిందని తెలిపారు. ఆపై 2017 డిసెంబర్ 2న కామారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ. “మీకు నిజాం పాలన కావాల..?లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా..?” అంటూ యువతను ప్రశ్నించారని, అదే సమయంలో బాబర్, గజనీ మహమ్మద్, ఖిల్జీ, హుమాయున్ తదితరుల పేర్లు చెబుతూ, వారు హిందువులపై అరాచకాలు చేశారని, అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, హిందువులను హత్యలు చేశారని మాట్లాడుతూ, యువతలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఇంటి కూడా అభ్యంతరకరమేనని అన్నారు. మరోసారి ఆయన మాట్లాడుతూ. రజాకార్లను ప్రస్తావించి, హిందు మహిళలపై వారు దమనకాండ సాగించారని అన్నారని, నిజామాబాద్ పేరును ఇందూరుగా పేరు మార్చాలని డిమాండ్ చేశారని, హైదరాబాద్, సికింద్రాబాద్, అదిలాబాద్, మహబూబ్‌నగర్‌ల పేర్లు మార్చాలని వ్యాఖ్యానించడంతో పరిపూర్ణానంద స్వామి  నగర బహిష్కరణకు గురయ్యారు.