పబ్లిసిటీ వద్దంటున్న ప్రియా వారియర్!

Priya Varrier is Kerala floods donation is not for publicity

వరదలతో తీవ్రమైన కష్టాల్లో ఉన్న కేరళకు తనవంతు సాయం చేశానని, సోషల్ మీడియా వేదికగా నటి ప్రియా వారియర్ తన అభిమానులకు సోషల్‌మీడియా ద్వారా చెప్పింది. ప్రియాకు ఎంతమాత్రమూ పబ్లిసిటీ వద్దని, ప్రచారం కోసం తానీ పని చేయలేదని అంటుంది. ఓనం పర్వదినం వేళ, తనవంతుగా చిన్న సాయం చేశానని, తన ఫాలోవర్స్ అంతా కూడా వారికి చేతనైనంత విరాళాలు అందించాలని చెప్పింది. మాటలు చెప్పడం కన్నా చేతల్లో చూపిస్తే ప్రభావ వంతంగా ఉంటుందని చెప్పిన ప్రియ, విరాళమిచ్చిన వారిని ప్రశంసించక పోయినా ఫర్వాలేదని, తక్కువ చేసి మాత్రం మాట్లాడవద్దని తన ఇన్‌స్టాగ్రామ్ లో వెల్లడించింది. కాగా, ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని తన హావభావాలతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన ప్రియ, ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు రూ. 8 లక్షలు వసూలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అటువంటిది ఆమె కేవలం రూ. లక్ష విరాళమిచ్చి, తనకు పబ్లిసిటీ వద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా అయింది.