పన్నీరు సెల్వం రాజీనామా ఆమోదం

Panneer

చెన్నయ్ : తమిళనాడు సిఎం ఒ.పన్నీరు సెల్వం రాజీనామాకి సోమవారం గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోద ముద్ర వేశారు. కొత్త సిఎం బాధ్యతలు చేపట్టే వరకు పన్నీరు ఈ పదవిలో కొనసాగనున్నారు. తమిళనాడు రాజకీయాలు ఆదివారం క్షణక్షణం మారిపోయిన విషయం తెలిసిందే. అన్నాడిఎంకె శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ అధినేత శశికళ ఎన్నికయ్యారు. దీంతో ఆమె సిఎం పదవి చేపట్టడం లాంఛనంగా మారింది. ఈ క్రమంలోనే పన్నీరు సెల్వం సిఎం పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్ ఈరోజు ఆమోదించారు. మంగళవారం లేదా గురువారం శశికళ సిఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Comments

comments