పనుల్లో నిర్లక్షం తగదు

Delete incompetent contractors

అసమర్ధ కాంట్రాక్టర్లను తొలగించండి
ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడానికి ఎంతకాలం పడుతుందంటూ మిషన్ భగీరథ అధికారులపై కలెక్టర్ ధర్మారెడ్డి ఆగ్రహం

మన తెలంగాణ/మెదక్ : ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్లు ఇవ్వడానికి ఇంకా ఎంతకాలం పడుతుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడి భగీరథ అధికారులను ప్రశ్నించారు. బుధవారం మిషన్‌భగీరథ కార్యక్రమంపై వాటర్ గ్రిడ్, ఆర్‌డబ్లుఎస్ అధికారులతో సమీక్షాసమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం పూర్తి కాలేదని, మెదక్ మండలం పిల్లికోట్టాల, రేగోడ్ మండలం ప్యారారం గ్రామాల్లో తాను పర్యటించినప్పుడు ఇంటింటికి నల్లా కనెక్షన్ పూర్తి కాలేదని గ్రామస్తులు వివరించారని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడానికి ఇంకా ఎన్నిరోజుల సమయం పడుతుందని అధికారులను ప్రశ్నించారు. పనులు అప్పగించిన కాంట్రాక్టర్‌లు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా… పనులు పూర్తిచేసే సామర్థం లేని కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడైతే పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదో ఆ ప్రాంతాల్లో పనులు వేరే కాంట్రాక్టర్‌కు అప్పగించి త్వరితగతిన పనలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రిడ్ ఇఇ సురేష్, ఆర్‌డబ్లుఎస్ ఇఇ లలితతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.