పడవ బోల్తా పడి 45 గల్లంతు

గువాహటి : అసోంలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గువాహటిలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణికులతో వెళుతున్న ఓ పడవ బోల్తా పడి 45మంది గల్లంతయ్యారు. అధికారులు, పోలీసులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో ప్రయాణికులను రక్షించేందుకు యత్నిస్తున్నారు. నీటి సరఫరా ప్రాజెక్టు కోసం నదిలో పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులతో వెళుతున్న పడవ సాంకేతిక లోపంతో ఓ పిల్లర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ప్రయాణికుల్లో అధికంగా విద్యార్థులే ఉన్నట్టు […]

గువాహటి : అసోంలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గువాహటిలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణికులతో వెళుతున్న ఓ పడవ బోల్తా పడి 45మంది గల్లంతయ్యారు. అధికారులు, పోలీసులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో ప్రయాణికులను రక్షించేందుకు యత్నిస్తున్నారు. నీటి సరఫరా ప్రాజెక్టు కోసం నదిలో పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులతో వెళుతున్న పడవ సాంకేతిక లోపంతో ఓ పిల్లర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ప్రయాణికుల్లో అధికంగా విద్యార్థులే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Boat  Rollover in River at Assam

Comments

comments

Related Stories: