పట్ట పగలు ఇంట్లో చోరి

బోయిన్‌పల్లి : మండలంలోని కోదురుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీలో చోరీకి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామాస్తులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రాంతంలో సుద్దాల మొండయ్య ఇల్లు తాళం వేసి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళం పగుల కొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళం పగుల కోట్టి చోరికి ప్రయత్నిస్తుండగా అప్పడే ఇంటి యజమాని మొండయ్య ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చుట్టు ప్రక్కల వారికి తెలపడంతో గ్రామస్థులు […]


బోయిన్‌పల్లి : మండలంలోని కోదురుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీలో చోరీకి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామాస్తులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రాంతంలో సుద్దాల మొండయ్య ఇల్లు తాళం వేసి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళం పగుల కొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళం పగుల కోట్టి చోరికి ప్రయత్నిస్తుండగా అప్పడే ఇంటి యజమాని మొండయ్య ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చుట్టు ప్రక్కల వారికి తెలపడంతో గ్రామస్థులు అతనిని పట్టుకొని చెట్టుకు కట్టేసి స్థానిక పోలీసు స్టేషన్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ వెంకటకృష్ణ ఘటన స్థలానికి చేరుకొని చోరి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఎవరైనా అనుమానితులు గాని చోరికి పాల్పడిన వ్యక్తులు కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలే తప్ప ఎవ్వరు కొట్ట కూడదని గ్రామస్థులకు తెలిపారు. అనంతరం చోరి చేసిన వ్యక్తి మద్యం సేవించి ఉండడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

comments

Related Stories: