పట్టువీడని ప్రభుత్వం…మెట్టు దిగని డీలర్లు

Dealers who are unsuccessful are the government

కలెక్టరేట్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన
జిల్లాలో 2వేల మంది డీలర్లకు నోటీసులు

మనతెలంగాణ/కరీంనగర్‌: చౌక ధరల దుకాణ డీలర్ల సమ్మెను విరమింప చేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండగా, డీలర్లుఅంతే పట్టుదలతో సమ్మెవైపు ముందుకు సాగుతున్నారు. నిత్యావసర వస్తువులకు సంబంధించి 24గంటల వ్యవధిలోగా డిడిలను చెల్లించాలంటూ పౌరసరఫరాల శాఖ ఇప్పటికే చౌక ధరల దుకాణ డీలర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సరైన సమాధా నం ఇవ్వని పక్షంలో సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. సంబంధిత నోటీసులను రెవెన్యూ సిబ్బంది శుక్రవారం నే రుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2112 మంది డీలర్లకు అందజేశారు. అయితే ఈ నోటీసులకు సమాధానం ఇస్తామని, సస్పెన్షన్ అంశాన్ని న్యాయ పరంగా ఎదుర్కొంటామ ని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. అటు ప్రభుత్వం,పౌరసరఫరాల శాఖ చౌక ధరల దుకాణ డీలర్ల సమ్మెపై తీవ్ర చర్యల కు ఉపక్రమిస్తామని పదేపదే ప్రకటించినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ సంఖ్యలో డీలర్లు జూలై మాసానికి స ంబంధించిన ని త్యావసరాలకు డిడిలు కట్టేందుకు ముం దుకు రాలేదు. కొన్ని సంఘా లు, గ్రూప్‌లతో పాటు తాత్కాలిక డీలర్ షిప్ కలిగి ఉన్న కొద్ది మంది మా త్రమే డిడిలు చెల్లించడంతో జిల్లా అధికార యంత్రాంగానికి ఎటు పాలుపోవడంలేదు.ఇదిలా ఉండగా సమ్మెలోకి వెళ్లితే మహిళ స ంఘాల ద్వా రా నిత్యావసరాలు పంపిణీ చేయిస్తామన్న ప్ర భుత్వ బెదిరింపులను నిరసిస్తూ చౌక దుకాణాల డీలర్లు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.ప్రభుత్వహెచ్చరికల కారణంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో ఒక డీలర్ ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టిన అంశాన్ని ప్రస్తావిస్తూ రా ష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని డీలర్లు హెచ్చరిస్తున్నా రు.పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అ ందాలన్న సదుద్దేశ్యంతో దశాబ్దాలుగా చాలీచాలనీ కమీషన్‌తో ఈ వృత్తి ని కొనసాగిస్తున్నామని వారు చెప్పారు.చౌక ధరల దుకాణా ల ద్వారా సరఫరా చేసే నిత్యావసర వస్తువుల సంఖ్య క్ర మేపి తగ్గిపోతూ కేవలం బియ్యం పంపిణీ కే పరిమితం కావడం వల్ల బతుకులు బజారున పడి ఆ ర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలో ఇప్పటికై 12 మంది డీలర్లు చనిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం
రెండు సంవత్సరాలుగా సమస్యలను పౌరసరఫరాలశాఖ మంత్రి,కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం . స్పందన లేదు. కమీషన్ పెంపు,గౌరవ వేతనం విషయంలో ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం దక్కలేదు. విధిలేని పరిస్థితులలోనే సమ్మెకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య పద్దతిన సమ్మెకు నోటిసు ఇస్తే చర్చలు జరిపి సమస్యలు ప రిష్కారించాల్సింది పోయి బెదిరింపులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ వి ధానాలను న్యాయపరంగానే ఎదుర్కొంటాం.
– రొడ్డ శ్రీనివాస్ అధ్యక్షుడు,చౌక ధరల దుకాణ డీలర్ల సంఘం

పాత బకాయిలు చెల్లించాలి
డీలర్లకు రావాల్సిన పాత బకాయిలతో పాటు గౌరవ వేతనం చెల్లించా లి.లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల సహకారంతో సమ్మె ను ఉదృతం చేస్తాం.సమస్యల పరిష్కారం కో సం ప్రాణత్యాగానికైన సిద్ధం.ఆకలి బాధతో తాము సమ్మెలోకి వెలుతున్నందున మహిళ గ్రూపులు, స్వశక్తి సంఘాలు గమనించి సమ్మె కు సహకారం అందించాలి.
– మద్దూరి సదానందం ప్రధాన కార్యదర్శి, చౌక ధరల దుకాణ డీలర్ల సంఘం