పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్

Cardon and search in town

మెదక్ : ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలతో పాటు ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు కార్డులను తీసుకోవాలని దీని ద్వారా ఏదైనా సంఘటన జరిగినప్పుటు వారిని గుర్తించే అవకాశముంటుందని డిఎస్పి వెంకటేశ్వర్లు పట్టణ ప్రజలకు సూచించారు. బుధవారం జిల్లా ఎస్పి చందనాదీప్తి ఆదేశాల మేరకు పట్టణంలోని ఫతెనగ్ ఏరియాలో ఉదయం 4.30 గం. నుండి 6 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ డిఎస్పి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సెర్చ్‌లో ముగ్గురు సిఐలు, ఆరుగురు ఎస్ఐలు, 44 మంది సిబ్బంది పాల్గొని 122 ఇండ్లను సుమారుగా 250 మంది వ్యక్తులను, ద్విచక్ర వాహనాలను, అనుమానితులను తనిఖీ చేశారు. ఈ తనిఖిలో సరైన దృవపత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ… ప్రజల సహకారంతోనే ఈ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాల వలన అసాంఘిక కార్యకలాపాలు జరుగుకుండా ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ ఏరియాలలో ఎలాంటి సమస్యలు జరిగిన దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు. నివసించే ప్రదేశాల్లో అనుమానంగా ఎవరైనా కనిపించిన వెంటనే 100కి గాని దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి తెలియజేస్తే వెంటనే తమ సిబ్బంది చర్యలు చేపడతారన్నారు. ఈ తనిఖిలో సరైన దృపత్రాలు లేని స్వాధీన పర్చుకున్న ద్విచక్ర వాహనాల యాజమానులు వాటికి సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారికి అప్పగించడం జరుగతుందన్నారు. ఈ సెర్చ్‌లో సిఐలు శ్రీరామ్‌విజయ్, రామక్రిష్ణ, రవీందర్‌రెడ్డితో పాటు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments