పక్కా ఆధారాలతోనే జగ్గారెడ్డి అరెస్టు : డిసిపి సుమతి

హైదరాబాద్ : పక్కా ఆధారాలతోనే కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డిసిపి సుమతి తెలిపారు. 2004లో తప్పుడు పాస్‌పోర్టులతో ముగ్గురిని ఆయన అమెరికా పంపించారని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జగ్గారెడ్డి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆమె వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్టు యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆధార్ డేటా ఆధారంగా ఈ కేసును ఛేదించామని చెప్పారు. రాజకీయ కక్షతోనే జగ్గారెడ్డిని అరెస్టు చేశామని […]

హైదరాబాద్ : పక్కా ఆధారాలతోనే కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డిసిపి సుమతి తెలిపారు. 2004లో తప్పుడు పాస్‌పోర్టులతో ముగ్గురిని ఆయన అమెరికా పంపించారని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జగ్గారెడ్డి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆమె వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్టు యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆధార్ డేటా ఆధారంగా ఈ కేసును ఛేదించామని చెప్పారు. రాజకీయ కక్షతోనే జగ్గారెడ్డిని అరెస్టు చేశామని వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా వైద్య పరీక్షల అనంతరం ఆయనను సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో ప్రవేశ పెట్టారు.

DCP Sumathi Comments on Jagga Reddy Arrest

Related Stories: