పక్కనే భార్య ఉండగా.. మరో యువతిపై…!

Indian Accused Of Sexual assault Sleeping Woman On flight

వాషింగ్టన్: విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కట్టుకున్న భార్య పక్కనే ఉండగా, మరో యువతిపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. నిద్రలో ఉన్న తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. మెలుకువ వచ్చిన యువతి సదరు వ్యక్తి చర్యకు భయపడి విమాన సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో సిబ్బంది అతగాడిని పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తిని విచారించిన డెట్రాయిడ్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. డిసెంబరు 12న అతడికి శిక్ష విధించనుందని సమాచారం. ఘటన వివరాల్లోకి వెళితే… అమెరికా ఆధారిత ఐటి కంపెనీలో పనిచేస్తున్న భారతీయుడి నిర్వాకం ఇది. రమణమూర్తి అనే వ్యక్తి అమెరికాలోని రోచెస్టర్‌ హిల్స్‌ సిటీలో ఉంటూ ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. అయితే, 7 నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్‌ వెళ్లే స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్ ఎక్కాడు. ఆ ప్రయాణంలో అతడికి ఓవైపు భార్య… మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు ఉపక్రమించాడు. తనపై ఏదో పాకుతున్నట్లు అనిపించిన యువతి వెంటనే కళ్లు తెరిచే చూసే సరికి ఆమె దుస్తుల బొత్తాలు విప్పి ఉన్నాయి. ప్రైవేట్ భాగాల వద్ద మూర్తి చేతులు తడుముతూ కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా ఆమె వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీనిపై నిందితుడిని విచారించగా ఆ సమయంలో తాను గాఢంగా నిద్రలో ఉన్నాననీ, తనకేం తెలియదంటూ మొదట బుకాయించాడు. గట్టిగా ప్రశ్నించేసరికి నిజం ఒప్పుకున్నాడు. దీంతో న్యాయస్థానం రమణమూర్తిని ఇటీవల దోషిగా తేల్చింది.

Comments

comments