పంద్రాగస్టుకు భగీరథ

అన్ని గ్రామాలకు జలరాశులు చేరాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం ప్రాజెక్టు సలహాదారుగా ఆర్‌డబ్లుఎస్ ఇఎఎన్‌సి సురేందర్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ బల్క్ ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని అందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మెజారిటీ పనులు పూర్తయ్యాయని, వేలాది గ్రామాలకు నీరు చేరుతూ ఉన్నదని, ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రిని డెడ్‌లైన్‌గా పెట్టుకుని అన్ని గ్రామాలకూ అప్పటికల్లా […]

అన్ని గ్రామాలకు జలరాశులు చేరాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
ప్రాజెక్టు సలహాదారుగా ఆర్‌డబ్లుఎస్ ఇఎఎన్‌సి సురేందర్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ బల్క్ ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని అందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మెజారిటీ పనులు పూర్తయ్యాయని, వేలాది గ్రామాలకు నీరు చేరుతూ ఉన్నదని, ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రిని డెడ్‌లైన్‌గా పెట్టుకుని అన్ని గ్రామాలకూ అప్పటికల్లా బల్క్‌గా నీటినిఅందించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ నిర్మాణపు పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్ భగీరథను మరింత సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ నిర్వహణ శాఖ (ఆర్‌డబ్లుఎస్)ను పునర్వ్యవస్థీకరించాలని సిఎం నిర్ణయించారు. రాబోయే 60నుంచి 80 రోజుల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టును వందకు వందశాతం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన చోట ప్రారంభంలో వచ్చే చిన్నచిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూ చించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై కెసిఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ సలహాదారులు జ్ఞానేశ్వర్, మనోహర్, సిఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో మెజారిటీ పనులు పూర్తయ్యాయని, గ్రామాల్లో అంతర్గత పనులతో పాటు, మరికొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. అన్ని గ్రామాలకు నీరివ్వడానికి ఆగస్టు 14 అర్థరాత్రిని డెడ్ లైన్ పెట్టుకుని, గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ నిర్మాణపు పనులను కూడా సమాంతరంగా పూర్తిచేయాలని సిఎం ఆదేశించారు.
గ్రామీణ త్రాగునీటి శాఖ పునర్ వ్యవస్థీకరణ :
మిషన్ భగీరధ ప్రాజెక్టు లక్షా 50 వేల కిలోమీటర్ల పొడవైన పైపులైను, 1400 మోటార్లు, 180 మెగావాట్ల విద్యుత్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన పెద్ద ప్రాజెక్టు కావడంతో అక్కడక్కడ వాల్వ్‌ల లీకేజీ లాంటి సమస్యలు ఉత్పన్నమవడం సహజమని, అలాంటి బాలారిష్టాల (టీతింగ్ ప్రాబ్లమ్స్)ను గుర్తించి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిఎం చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించే వర్క్ ఏజెన్సీలు, అధికారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆర్.డబ్ల్యు. ఎస్. ఇఎఎన్‌సిగా పనిచేస్తున్న సురేందర్ రెడ్డిని ప్రాజెక్టు సలహాదారుడిగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆ స్థానంలో సిఇ కృపాకర్ రెడ్డిని ఇఎన్‌సిగా నియమించాలని చెప్పారు. ప్రస్తు తం ఆర్.డబ్ల్యు.ఎస్.లో నలుగురు సిఇలు ఉన్నారని, విధులను సమర్థంగా నిర్వహించేందుకు సిఇ ల సంఖ్యను తొమ్మిదికి పెంచాలని ఆదేశించారు. సిఇల పరిధిని నిర్ణయించడంతో పాటు, సెగ్మెంట్లవారీగా పనుల షెడ్యూల్‌ను శుక్రవారం మధ్యా హ్నం నాటికి నిర్థారించాలని చెప్పారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు చేస్తున్న వర్క్ ఏజన్సీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులను పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. మిషన్ భగీరథ పనులను ఇకపై ప్రతీరోజు పర్యవేక్షించాలని, ఎక్కడ పనులు పూర్తయితే అక్కడ నీరు సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ సబ్ స్టేషన్లు, పంపు హౌజుల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. లో ఓల్టేజి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.విద్యుత్ శాఖ, మిష న్ భగీరథ అధికారులు సమావేశమై విద్యుత్ లైన్ల ను ప్రాజెక్టుకు అనుసంధానం చేసే విషయంపై తుది చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గడువుకన్నా ముందే పూర్తయిన విద్యుత్ పనులు
నిర్ణీత గడువుకన్నా ముందే మిషన్ భగీరథ పథకానికి కావాల్సిన విద్యుత్ సరఫరా వ్యవస్థను తెలంగాణ విద్యుత్ సంస్థలు సిద్ధంచేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పంపుసెట్లు నడవడానికి అనువుగా రూ.280 కోట్ల వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లు, పవర్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్ కో- జెన్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు ఈ సమావేశంలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందజేశారు. మిషన్ భగీరథ పథకం విద్యుత్ సంబంధ వ్యవస్థలన్నీ 2018 ఆగస్టు 15 నాటికి పూర్తి కావాలని గతంలో ముఖ్యమంత్రి గడువు విధించారని, ఈ గడువుకన్నా నెల రోజుల ముందే (జూలై 15 నాటికే) పనులన్నీ పూర్తి చేసి, మిషన్ భగీరథ పథకానికి అప్పగించినట్లు సిఎండి ప్రభాకర్ రావు వివరించారు. మిషన్ భగీరధ అవసరాల కోసం ప్రత్యేకంగా 180 మెగావాట్ల విద్యుత్తును నిరంతరాయంగా అందించడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా చేశామని, కేవలం ఈ పథకం కోసమే ‘డెడికేటెడ్’ లైన్లు కూడా వేశామని తెలిపారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా గౌరిదేవిపల్లిలో, నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరులో 220/11 కెవి సబ్ స్టేషన్లు నిర్మించినట్లు వెల్లడించారు. మొత్తం 44 సబ్ స్టేషన్లు, 603.57 కిలోమీటర్ల మేర 33 కెవి లైన్లు, 603.3 కిలోమీటర్ల 11 కెవి లైన్లు, 46 పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, 314 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్.పి.డి.సి.ఎల్. (దక్షిణ డిస్కం) పరిధిలోని ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో రెండు 220/11 కెవి సబ్ స్టేషన్లు, పదహారు 33/11 సబ్ స్టేషన్లు, 249.94 కిలోమీటర్ల 33 కెవి లైన్లు, 254.94 కిలీమీటర్ల 11 కెవి లైన్లు, 126 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్.పి.డి.సి.ఎల్ (ఉత్తర డిస్కం) పరిధిలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లోఇరవై ఆరు 33/11 కెవి సబ్ స్టేషన్లు, 353.63 కిలోమీటర్ల 33కెవి లైన్లు, 348.36 కిలోమీటర్ల 11 కెవి లైన్లు, 46 పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, 188 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Related Stories: