పండుటాకులకు పరేషాన్

*పింఛన్ల కోసం గంటల కొద్దీ నిరీక్షణ *నగదు కొరతతో మళ్లీ ఇబ్బందులు మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ : జిల్లా వ్యాప్తంగా ప్రతీనెల వృద్ధాప్య, వికలాంగులు, వితంతు, తదితర పింఛన్‌లు తీసుకునే లబ్ధిదారులకు మళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకుల నుండి ఆర్‌బిఐ నుండి సకాలంలో తపాలా కార్యాలయాల వరకు చేరుకోకపోవడంతో వృద్ధులు పరేషాన్ అవుతున్నారు. రూ.15లక్షల వరకు నగదు అవసరం ఉండగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు సుమారు రూ.8లక్షల లోపు నగదు అవసరం ఉం టుంది. గత ఏడాది […]

*పింఛన్ల కోసం గంటల కొద్దీ నిరీక్షణ
*నగదు కొరతతో మళ్లీ ఇబ్బందులు

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ : జిల్లా వ్యాప్తంగా ప్రతీనెల వృద్ధాప్య, వికలాంగులు, వితంతు, తదితర పింఛన్‌లు తీసుకునే లబ్ధిదారులకు మళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకుల నుండి ఆర్‌బిఐ నుండి సకాలంలో తపాలా కార్యాలయాల వరకు చేరుకోకపోవడంతో వృద్ధులు పరేషాన్ అవుతున్నారు. రూ.15లక్షల వరకు నగదు అవసరం ఉండగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు సుమారు రూ.8లక్షల లోపు నగదు అవసరం ఉం టుంది. గత ఏడాది నవంబర్ 8న అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేయగా నగదును అతికష్టం మీద బ్యాకుల వద్ద క్యూలైన్‌లో నిల్చొని మార్చుకున్న ప్రజలు ప్రస్తుతం తమవద్ద ఉన్న నగదును బ్యాంకులలో డిపాజిట్‌లు చేయకపోవడంతో నగదు కొరత ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు బ్యాంకులలో  నగదు కొరత లేకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డిజిటలైజేషన్, జీఎస్‌టీ, ట్యాక్స్‌లు బ్యాంకులలో వినియోగదారులకు పెట్టే విధి విధానాల వల్ల ప్రజలు బ్యాంకుల వద్దకు వచ్చి డబ్బులను దాచేందుకు మొహం చాటేస్తున్నారు. మనకెందుకులే ఇబ్బందులు అని వ్యవహరిస్తున్నారు. నగదు కొరతతో ఈ ప్రభావం వృద్దాప్య పింఛన్‌లపైన పడింది. ప్రతినెలా పింఛన్లను తపాలా కార్యాలయ అధికారులు బమోమెట్రిక్ ద్వారా పంపిణీ చేశారు. ఒకవైపు నగదు కొరత మరోవైపు మిషన్‌లకు కేవలం 2జీ సిగ్నల్స్ మాత్రమే ఉండడంతో పంపిణీకి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. పింఛన్ల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తుంది. కొందరు వృద్ధులు, వికలాంగులకు తమ బంధువులను వెంట బెట్టుకుని ఆటోలలో వచ్చి మరీ పింఛన్లను  తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కో సమయంలో తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నగదు లేదనే సమాధానం రావడంతో వృద్ధులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత రెండు రోజుల క్రితం తమకు నగదు కొరతతో పింఛన్‌లు రావడం లేదని ఎంఎల్‌ఎ కోవలక్ష్మి దృష్టికి సైతం తీసుకెళ్లారు. ప్రతీ నెల పింఛన్ల కోసం తపాలా కార్యాలయాల వద్ద వేచి చూస్తుండడం, చెట్లకింద సేద తీరడం కనబడుతుంది. సరైన సమయంలో తమకు పింఛన్లు రావడం లేదని, సిగ్నల్‌లు లేక తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సైతం సిగ్నల్ సమస్య పింఛన్‌దారులను వెంటాడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని తమకు ఇబ్బందులు కల్గకుండా సరైన సమయంలో పింఛన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరారు.

Comments

comments

Related Stories: