పంజాబ్‌కు ‘సన్’ స్రోక్

Hyderabad sunrisers won by punjab
13 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపు
బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసిన సన్‌రైజర్స్ బౌలర్లు
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 133 పరుగుల అత్య ల్ప లక్షాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఛేదించలేకపోయింది. చివరికి హైదరాబాద్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 119 పరుగులకే పంజాబ్ జట్టు ఆలౌట్ అయి పరాజయం మూటగట్టుకుంది. లక్ష ఛేదనకు దిగిన గేల్, రాహుల్ ఓపెనర్ల జోడి తమ భాగస్వామ్యంలో 30 బంతుల్లో 35 పరుగులు చేశారు. రాహుల్ ఫోర్లు బాది స్కోరును పెంచాడు. ఆరవ ఓవర్‌కల్లా పంజాబ్ జట్టు వికెటు నష్టపోకుండా 44 పరుగుల స్కోరును సాధించింది. 6.3 ఓవర్లో గేల్ మరో సిక్సర్ బాదాడు. అప్పుడు రషీద్ ఖాన్ వేసిన లెగ్‌స్పిన్ బంతికి రాహు ల్(32) ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడబో యి బౌల్డ్ అయ్యాడు. 10వ ఓ వర్లో పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. 12.1 ఓవర్లో షకీబ్ వేసిన బంతి కి మయాంక్ అగర్వాల్(12) మనీశ్‌పాండే చేతిలో క్యాచౌట్ అయాడు. 15.5 ఓవర్లో సందీ ప్ శర్మ వేసిన బంతిలో ఆండ్రూ టై(4)ఎల్‌బిడబ్లు అయ్యాడు. 16వ ఓవర్లో పంజాబ్ జట్టుకు గెలవడానికి 36 పరుగులు కావలసి ఉండగా, హైదరాబాద్ బౌ లర్లు 63 పరుగులు చేయాల్సినంతగా ఇబ్బంది పెట్టారు. మ రోవైపు స్టేడియంలో ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
క్లుప్తంగా స్కోరు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: 132/6(20 ఓవర్లు)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: 119/10(19.2 ఓవర్లు)

The post పంజాబ్‌కు ‘సన్’ స్రోక్ appeared first on .