పంచాయతీ రిజర్వేషన్లపై సుప్రీంకు: సిఎం కెసిఆర్

హైదరాబాద్: పంచాయతీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గతంలో సుప్రీం తీర్పును అమలు చేయాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు 61 శాతం పునరుద్ధరించాలని ప్రభుత్వం కోరనుంది. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ […]

హైదరాబాద్: పంచాయతీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గతంలో సుప్రీం తీర్పును అమలు చేయాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు 61 శాతం పునరుద్ధరించాలని ప్రభుత్వం కోరనుంది. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం కేబినేట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సిఎం ఆదేశించారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తమ సర్పంచ్ ద్వారా పిటిషన్ వేయించిందని, బిసిల రిజర్వేషన్లకు కాంగ్రెస్ గండికొట్టే ప్రయత్నం చేస్తుందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. బిసి రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బిసి రిజర్వేషన్లపై అవసరమైన న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

Related Stories: