పంచాయతీ కార్మికులు రాజీవ్ రహదారిపై రస్తారోకో

శామీర్‌పేట : పంచాయతీ కార్మికుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేష్ డిమాండ్ చేశారు. గురువారం శామీర్‌పేట మండల క్యారాలయం ఎదురుగా రాజీవ్ రహదారిపై పంచాయతీ కార్మికులు రస్తారోకో నిర్వహించారు. వారికి సంఘీభావం తెలుపుతు ఆయన ప్రసంగించారు. గత 17 రోజులుగా పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైన లేదని విమర్శించారు. తెల్లవారే సరికి గ్రామాలను శుభ్రం చేసే కార్మికులపై వివక్షత చూపరాదని చెప్పారు. ఇప్పటికైన ప్రభుత్వం […]


శామీర్‌పేట : పంచాయతీ కార్మికుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేష్ డిమాండ్ చేశారు. గురువారం శామీర్‌పేట మండల క్యారాలయం ఎదురుగా రాజీవ్ రహదారిపై పంచాయతీ కార్మికులు రస్తారోకో నిర్వహించారు. వారికి సంఘీభావం తెలుపుతు ఆయన ప్రసంగించారు. గత 17 రోజులుగా పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైన లేదని విమర్శించారు. తెల్లవారే సరికి గ్రామాలను శుభ్రం చేసే కార్మికులపై వివక్షత చూపరాదని చెప్పారు. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఐతో పాటు కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ జనసమితి, సిపిఎం, సిఐటియు నాయకులు పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. రస్తారోకో చేస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కార్మికులకు నచ్చ చెప్పి శాంతింపచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: